అత్యంత ప్రజాదరణతెలంగాణ

ఆదివారం ఆట బాలుని నుదిటి మరణ బాట

బాలుని ప్రాణం తీసిన టెన్నిస్ బంతి

హైదరాబాద్ ఫిలింనగర్ దుర్గాభవానీనగర్ ప్రాంతానికి చెందిన శేఖర్,యాదమ్మలకు ఇద్దరు పిల్లలు. శేఖర్ ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందాడు. యాదమ్మ ఇళ్లలో పనిచేసుకుంటూ ఇద్దరు పిల్లల్ని పెంచుతుంది. పెద్దకుమారుడైన అఖిల్(12) ఫిలింనగర్ లోని రౌండ్ టేబుల్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఆదివారం ఉదయం స్నేహితులతో క్రికెట్ ఆడుకుందాం అనుకున్నాడు. పక్కనే ఉన్న కల్చరల్ సెంటర్ కి చెందిన టెన్నిస్ కోర్టులో ఆడుకుని వదిలేసిన బంతులను గమనించాడు.

బంతులను తెచుకొనేందుకు ఎమ్మార్సీ కాలనీ వైపు ఉన్న గోడ మీదుగదా లోపలి వెళ్లి నాలుగు బంతులను తీసుకొని జేబులో వేసుకున్నాడు. మరో రెండు బంతులను చేతిలో తీసుకొని తిరిగి వెళ్లేనా క్రమంలో బంతులు ట్రాన్సఫార్మర్ వద్ద ఉన్న గోడ పై పెట్టి దాన్ని పైకి ఎక్కే ప్రయత్నం చేసాడు. కంచె లేక పోవడంతో ట్రాన్సఫార్మర్ తీగలు తగిలి షాక్ గురై మరణించాడు…

Comment here