ఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణమిర్చి మసాలా

కరోనా గూర్చి సోషల్ మీడియాలో పచ్చి అబద్దాలు.. ఇవే వాస్తవాలు

 

గత కొంతకాలంగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ పై అనేక అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో హల చల్ చేస్తున్నాయి. దీనిని సిరియస్ గా తీసుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) రకరకాల వదంతులు వ్యాప్తి చేస్తున్న పేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్లను బ్లాక్ చేస్తోంది.

 

సోషల్ మీడియా లో వైరల్ గా మారిన కొన్ని తప్పుడు కథనాలు ఇవే..

 

వదంతం:మాంసం తింటే.. కరోనా వైరస్ వస్తుంది.
వాస్తవం:ఇది తప్పుడు ప్రాచారం. చైనాలో ఈ వైరస్ కి కారణం పాములా, గబ్బిలాలా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు అలాంటప్పుడు కోడి, మేక, గొర్రె మాంసం తినడం వల్ల ఎలా వస్తుంది..? కాబట్టి చికెన్, మటన్ తినడం వల్ల కరోనా సోకదు.

 

వదంతం:పెంపుడు జంతువుల వల్ల కరోనా వస్తుంది.
వాస్తవం: కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువుల వల్ల ఈ కరోనా సోకిది అనడానికి ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. కాబట్టి ఇది కూడా అవాస్తవం.

 

వదంతం; చైనా నుండి దిగుమతి అవుతున్న వస్తువులు తాకితే .. కరోనా వైరస్ వస్తుంది.
వాస్తవం: ఇది కూడా నిజం కాదు. కరోనా భూ ఉపరితలం పై బ్రతకదు. కాబట్టి చైనా వస్తువులను నిస్సందేహంగా తాకొచ్చు.

 

వదంతం:వెల్లులి, మిరియాలు, నువ్వుల నూనె, ఉప్పు నీళ్లు వంటివి వాడటం వల్ల కరోనా రాదు.
వాస్తవం: ఇది పచ్చి అబద్దం. సోసిల్ మీడియా లో పాపులర్ అవడానికి కొంతమంది ఆయుర్వేద నిపుణులు ఆడుతున్న నాటకం ఇది. వీటిని వాడటం వల్ల సాధారణంగా ఉండే ప్రయోజనాలే తప్పా.. కరోనాని ఇవి నియంత్రిచలేవు.

Comment here