గుసగుసలుటాలీవుడ్మిర్చి మసాలాసినిమా వార్తలు

నక్సలైట్ పాత్రలో ‘చిరు’త?

చిరంజీవి-152వ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. దర్శకుడు కొరటాల శివ-మెగాస్టార్ కాంబినేషన్లలో చిరంజీవి-152వ సినిమా ప్రారంభమైన సంగతి తెల్సిందే. ఈ మూవీ ప్రారంభమైనప్పటి నుంచి రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ మూవీలో చిరంజీవి డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. పవర్ ఫుల్ ఎండోన్మెంట్ ఆఫీసర్ పాత్రలో చిరంజీవి కనిపించబోతున్నాడు. అదేవిధంగా మరో పాత్రలో చిరంజీవి నక్సలైట్ గా కనిపించనున్నారనే ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ పాత్రలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ కనిపించబోతున్నారని తెలుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తి కాగానే రాంచరణ్ ఈ మూవీలో నటించనున్నారు.

చిరంజీవి-152వ మూవీలో రాంచరణ్ నటించనున్నారని తెల్సిన తర్వాత ఆయన ఓ పాత్ర చేస్తాడనే ఆసక్తి అందరిలో నెలకొంది. చిరంజీవితో రాంచరణ్ గతంలో ‘మగధీర’, ‘బ్రూలీ’ వంటి చిత్రాల్లో నటించాడు. అయితే కేవలం గెస్ట్ రోల్, పాటల్లో మాత్రమే తళుక్కున మెరిపి మాయమైపోయేవి. అయితే ఈ మూవీలో రాంచరణ్ దాదాపు 40నిమిషాలపాటు కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. రాంచరణ్ ఈ మూవీలో నక్సలైట్ పాత్రలో కనిపించబోతున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే చిరంజీవి యుక్త వయస్సు పాత్రలో రాంచరణ్ నటిస్తారా? లేక దర్శకుడు కొరటాల రాంచరణ్ కోసం ప్రత్యేక బ్యాక్ డ్రాప్ సిద్ధం చేశాడా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

ఇప్పటికే చిరంజీవి మూవీకి ‘ఆచార్య’ అనే టైటిల్ ఖారారైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ హైదరాబాద్ పరిసరాల ప్రాంతాల్లో శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. రాంచరణ్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్లో బీజీగా ఉండటంతో ఆయన పాత్ర మినహా మిగతా సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ కాంప్లీట్ అయ్యాక రాంచరణ్ చిరంజీవి-152వ మూవీలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ప్రధాన హీరోయిన్ గా త్రిష ఎంపికైన సంగతి తెల్సిందే. చిరంజీవి-రెజీనాల మీద ఇటీవలే ఓ ఫోక్ సాంగ్ చిత్రీకరించారు. ఈ మూవీకి మ్యూజికల్ బ్రహ్మ మణిశర్మ బాణీలను సమకూరుస్తున్నాడు. ఒకే సినిమాలో మెగాస్టార్, మెగా పవర్ స్టార్ రెండు పవర్ ఫూల్ పాత్రలో కనపించబోతుండటంతో మెగా అభిమానులు సంబరపడిపోతున్నారు.

Comment here