వైరల్

ప్లాస్టిక్‌ బాటిల్‌ మింగిన పాము.. వీడియో వైరల్

ప్లాస్టిక్ పొల్యూషన్ మనుషులకే గాక ఇతర జీవాలకు కూడా హానికరంగా మారుతోంది. వాటిని పొరబాటున మింగిన వీటి పని ఖతం అయినట్టే ! అయితే ఒక్క కోబ్రాల విషయంలో మాత్రం కాదట.. ఇందుకు నిదర్శనంగా ఓ కోబ్రా మింగేసిన ప్లాస్టిక్ బాటిల్ ని మళ్ళీ ఎంచక్కా బయటకి విసిరేసింది. పర్వీన్ కస్వాన్ అనే ఓ ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ ఇందుకు సంబంధించి రిలీజ్ చేసిన ఓ వీడియో ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది. ఈ బాటిల్ ను మింగి ఉబ్బిన కడుపుతో ఉన్న ఈ సర్పం కాసేపటికే దాన్ని మళ్ళీ ఆట్టే నోటి ద్వారా తిరిగి బయటకు ‘ కక్కేసింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వంటివి వైల్డ్ లైఫ్, ఇతర జాతి జంతువులకు కూడా ఎంతో హానికరమని ఆ ఆఫీసర్ అంటున్నాడు. ఇక్కడో కొత్త విషయం చెప్పుకోవాలి. సరీసృపాల్లో ఒక్క కోబ్రా మాత్రమే తాను మింగిన వస్తువులను మళ్ళీ వెలుపలికి విసర్జించగలవని ఆయన చెబుతున్నాడు. ఇతర జంతువులేవీ ఇలా చేయజాలవని ఆయన పేర్కొన్నాడు. ఈ వీడియోను 25 వేలమంది చూసి నోళ్లు వెళ్ళబెట్టగా.. టన్నులకొద్దీ లైక్స్ వచ్చి పడ్డాయి.

Comment here