గుసగుసలుమిర్చి మసాలాసినిమా వార్తలు

మెగాస్టార్ మూవీలో సమంత?

మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాలో సమంత రంగంలోకి దిగనుందని తెలుస్తోంది. ఈ మూవీని దర్శకుడు కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. కమర్షియల్ డైరెక్టర్ కొరటాల శివ మెగాస్టార్ తో తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డాడు. ఈ మూవీలో మెగాస్టార్ తోపాటు పలువురు స్టార్లు కూడా కనిపించబోతుండటంతో ఈ మూవీపై రోజురోజుకు మరిన్ని అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ మూవీలో మెగాస్టార్ తనయుడు ఓ కీలక పాత్రలో రాంచరణ్ నటించనున్నాడు. ఈ మూవీలో రాంచరణ్ కు జోడీ సమంత నటించనున్నారని ప్రచారం జరుగుతుంది.

చిరంజీవి ఈ మూవీలో డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఓ పవర్ ఫుల్ ఎండోన్మెంట్ అధికారికి కనిపించబోతున్నాడు. ఈ మూవీలో ప్రధాన హీరోయిన్ గా త్రిష ఎంపికైంది. అలాగే మరో తెలుగమ్మాయి ఈషా రెబ్బా కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈ మూవీ పొడ్యూసర్ అయిన రాంచరణ్ కూడా ఈ మూవీలో దాదాపు 30నిమిషాల పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. రాంచరణ్ నక్సలైట్ గా చేయనునట్లు ప్రచారం జరుగుతుంది. అలాగే రాంచరణ్ కు జోడీగా రంగస్థలం బ్యూటీ సమంత నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటీకే ఈ మాస్ సాంగ్ హీరోయిన్ రెజీనాతో మెగాస్టార్ ఆడిపాడారు. దీంతో ఈ మూవీలో చాలామంది స్టార్లు కనిపించనున్నారు. రోజుకో స్టార్ మెగాస్టార్-152వ మూవీలో వచ్చి చేరుతుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

చిరంజీవి-152వ మూవీకి ‘ఆచార్య’ అనే టైటిల్ ఖరారైనట్లు వార్తలు విన్పిస్తున్నాయి. ప్రస్తుతం రాంచరణ్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో బీజీగా ఉన్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కాంప్లీట్ అయ్యాక రాంచరణ్ ఈ మూవీలో నటించనున్నారు. ఇప్పటికే 30రోజులు కాల్షిట్లు దర్శకుడు కొరటాల శివకు కేటాయించినట్లు తెలుస్తోంది. రాంచరణ్ పాత్ర మినహా మిగతా షూటింగ్ సన్నివేశాలు జరుగుతున్నాయి. ఈ మూవీని 150కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మాత రాంచరణ్ మ్యాట్నీ మూవీస్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి మ్యూజికల్ బ్రహ్మ మణిశర్మ అదిరిపోయే బాణీలను సమకురుస్తున్నారు.

Comment here