తెలంగాణరాజకీయాలు

సుత్తిలో బంగారం..అడ్డంగా దొరికిన ప్రయాణికుడు

ఇతర దేశాల నుంచి ఆశ్రమంగా భారతదేశంలోకి బంగారం తీసుకొనిరాటానికి కేటుగాళ్లు అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంటారు. అందులో భాగంగానే దుబాయ్ నుంచి 931 గ్రామూల బంగారాన్ని సుత్తిలో పెట్టి తరలిస్తున్న ముగ్గురు ప్రయాణికులని హైదరాబాద్ విమానాశ్రయంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

అలాగే దుబాయ్ నుంచి వస్తున్న మరో వ్యక్తి దగ్గర కూడా..సుత్తిలో 931 గ్రాముల బంగారం దొరికింది. ఈ ఘటన ముంబై విమానాశ్రయంలో చోటు చేసుకుంది. మరో ఘటనలో దుబాయ్ నుండి హైదరాబాద్ వస్తున్న ఇద్దరి ప్రయాణికుల దగ్గర మిక్సీలో దాచిన 650 గ్రాముల బంగారం లభించింది.

ఇలా అన్ని ఘటనలలో కలిపి మొత్తం రెండు కిలోల దాక బంగారం లభించిందని అధికారులు తేల్చారు. వీరిపై కస్టమ్స్ చట్టం కింద కేసు నమోదు చేసి..అరెస్ట్ చేసారు. దీని గురించి విన్న వాళ్లంతా సుత్తిలో బంగారం తరలించటం ఏంటబ్బా.. విడ్డురంగా..అంటూ..విస్మయానికి లోనయ్యారు.