గుసగుసలువైరల్సినిమా

సునీత బాటలో.. రెండో పెళ్లికి రెడీ అయిన ప్రముఖ నటి

Actress Surekha Vani To Get Re-Married?

ఇటీవల సింగర్ సునీత తన పిల్లల సమ్మతితో తిరిగి రెండో వివాహం చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు సునీత బాటలోనే మరో నటి కూడా నడుస్తోంది.

టాలీవుడ్ నటి సురేఖా వాణి కుమార్తె తాజాగా రెండో పెళ్లి చేసుకున్నట్టు టాలీవుడ్ లో ఒక రూమర్ చక్కర్లు కొడుతోంది. సురేఖా వాణి భర్త 2019 సంవత్సరంలో అనారోగ్యంతో మరణించారు. అప్పటి నుండి నటి తన కుమార్తెతో ఒంటరి జీవిస్తోంది.

టాలీవుడ్ లో ఇప్పుడు ప్రతిభావంతులైన నటిగా సురేఖ వాణి గుర్తింపు పొందారు. అదే సమయంలో ఆమె అసలు వయస్సు కంటే చాలా సంవత్సరాలు చిన్నదిగా కనిపిస్తుంది. ఈ మధ్య హాట్ హాట్ ఫొటోలతో కూతురితో కలిసి చేసిన సందడి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హీరోయిన్‌తో సమానంగా ఈ నటికి అభిమానులు పెరిగారు.

సునీత రెండో వివాహం చేసుకొని సమాజానికి కొత్త దిశానిర్ధేశం చేశారు. ఇప్పుడు సురేఖా వాణి కుమార్తె తన తల్లిని తిరిగి వివాహం చేసుకోవాలని ప్రోత్సహిస్తోందని తెలిసింది..

ప్రతిదీ సరిగ్గా జరిగితే.. కాబోయే వ్యక్తి సరైనవాడు తన జీవితంలోకి వస్తే, సురేఖా వాణి కూడా తన కుమార్తె సమక్షంలో వివాహం చేసుకోవచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Back to top button