ఆంధ్రప్రదేశ్మిర్చి మసాలారాజకీయాలు

ఒక పక్క జగన్ తో..మరో పక్క పవన్ తో బీజేపీ మాస్టర్ ప్లాన్

రోజు రోజుకి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏపీలో అధికారం చేజిక్కిచ్చుకోటానికి బీజేపీ పెద్ద ప్రణాళికనే సిద్ధం చేసినట్లుగా అనిపిస్తుంది. ఇటీవల కాలంలోనే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకొని మునిసిపల్ ఎలక్షన్స్ కి వెళ్లాలనే నిర్ణయం తీసుకుంది. అయితే జనసేనతో కలిసి అధికారంలోకి వెళ్లగలమో లేదో.. అని లోలోపల మధనపడుతూనే..బయటికి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది.

దేశ వ్యప్తంగా క్రమంగా బీజేపీ గ్రాఫ్ పడిపోతూ వస్తుంది . పార్లమెంటులో పూర్తిస్థాయి బలం ఉన్నా.. అసెంబ్లీ స్థానాలలో మాత్రం అనుకున్నంత స్థాయిలో ప్రభావం చూపలేకపోతుంది. చాల రాష్ట్రాలలో ఇప్పుడు ప్రాంతీయ పార్టీలదే హవా..వాటిని అధిగమించలంటే..బీజేపీకి కష్టమైన పనే. ఈ మధ్య విడుదల అయిన అన్ని అసెంబ్లీ ఫలితాలలో.. ఏవీ కూడా బీజేపీ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి. మహారాష్ట్రలో శివసేన హ్యాండ్ ఇవ్వటంతో..అధికారానికి దూరం అయ్యింది. హరియానాలో జేజేపీ సహాయంతో అతికష్టం మీద అధికారం చేజిక్కిచ్చుకుంది. ఢిల్లీలో అయితే ఆమ్ ఆద్మీ పార్టీ దెబ్బకి బీజేపీ దుకాణం కట్టేసాల అయ్యింది. ఇలా వరుసగా తగులుతున్న ఎదురుదెబ్బలకు స్వస్తి చెప్పలనీ..అన్ని రాష్ట్రాలలో పకడ్బందీ ప్రణాళికని రచిస్తోంది.

ఇందులో భాగంగానే ఏపీలో ఉన్న రెండు ముఖ్య పార్టీలను తన వైపు తిప్పుకుంది. జనసేనతో పొత్తు పెట్టుకుని..ఇప్పుడు వైసీపీతో రహస్య మంతనాలు జరుపుతుంది. సీఎం జగన్ మొన్న హుటాహుటిన ఢిల్లీ వెళ్లి మోడీని కలిశారు…మరల ఈరోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లి అమిత్ షా ని కలవనున్నారు. ఇప్పడు జగన్ ఢిల్లీ పర్యటనపై ప్రతిపక్షాలు కూడా ఆసక్తిగా చూస్తున్నాయి. జగన్, బీజేపీ నాయకత్వంతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకుంటున్నాడు అనే జనలలో కూడా గుసగుసలు. ఇలాంటి వార్తలు పుట్టటానికి గల కారణం జగన్, మోడీ ప్రభుత్వంపై సానుకూలంగా స్పందించటమే..అవసరమైన అన్ని విషయాలలో బీజేపీకి మద్దతుగా నిలుస్తూనే ఉన్నాడు. బీజేపీ కూడా జగన్ పై ఇదే ధోరణి ప్రదర్శిస్తుంది. దీనితో జగన్ మోడీలు తేర వెనుక రహస్య ఒప్పందాలు చేసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇలా జనసేనని, వైసీపీని ఉపయోగించుకొని పూర్తి స్థాయిలో బలపడాలనే ప్రయత్నంలో ఉంది. ఈ విధంగా అధికారంలో ఉన్న వైసీపీతోను, ప్రజల్లో ఎదుగుతున్న జనసేనతోను కలిసి అధికారంలోకి రావాలనుకుంటుందనే వార్త ప్రజల్లో చక్కర్లు కొడుతుంది.