గెస్ట్ కాలమ్జాతీయంరాజకీయాలు

ట్రంప్ కు మురికి వాడలు కనిపించకుండా అడ్డుగోడలు!

దేశం మొత్తానికి ఆదర్శంగా గుజరాత్ రాష్ట్రాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుష్కరకాలం పాటు ప్రధానిగా ఉన్న సమయంలో తీర్చిదిద్దరని ఒక వంక బిజెపి ప్రచారం చేస్తుంటుంది. అయితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ వస్తున్నారంటే అక్కడున్న బీజేపీ ప్రభుత్వం ఖంగారు పడుతున్నది.

రాష్ట్ర రాజధాని గాంధీనగర్ పరిసరాలలోనే మురికి కాలువలు, మురికివాడలు చూసి ఆయనిక్కడ మోదీ అభివృద్ధి నమూనా ఇదే అని పెదవి విరుస్తారో అనుకొంటూ హడావుడిగా అవి కనిపించకుండా చేస్తున్నారు.

ట్రంప్‌ పర్యటించే మార్గంలోని మురికివాడలు ఆయనకు కనిపించకుండా అడ్డుగోడ నిర్మాణం చేపడుతున్నారు. ఈ మేరకు అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు ఒక్కో గోడ ఎత్తును కనీసం ఆరు నుంచి ఏడు అడుగుల వరకు పెంచుతున్నారు. సుమారు రూ. 50 కోట్ల వ్యయంతో ఈ పనులు చకచకా జరుగుతున్నాయి.

గాంధీనగర్‌ విమానాశ్రయం నుంచి ఆర్థిక రాజధాని అహ్మదాబాద్‌ మధ్య ఉండే సర్దార్‌ వల్లభ్‌ భారు పటేల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ట్రంప్‌, మోడీలు రోడ్‌ షో నిర్వహించనున్నారు. విమానాశ్రయాన్ని దాటి బయటికి వచ్చాక.. అహ్మదాబాద్‌ వైపు వెళ్లే మార్గానికి ఒక వైపున పెద్ద సంఖ్యలో మురికివాడలు ఉంటాయి. వాటిని దేవ్‌ శరణ్‌ లేదా శరణి ఆవాస్‌ అని పిలుస్తారు. ఇపుడు ఈ మురికివాడలు కనిపించకుండా అడ్డుగోడ కడుతున్నారు.

గోడ వెనుక ఏమున్నదో తెలియకుండా దాచిపెట్టే ప్రయత్నంతో… ముందు భాగమంతా రంగులు, మొక్కలతో అలంకరించబోతున్నారు. దీనికోసం సుమారు 2500 మొక్కలను సిద్ధం చేస్తున్నారు.

2002లో హైదరాబాద్‌కు అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ వచ్చినపుడు ఇక్కడ ఉన్న బిచ్చగాళ్లను వెతికి మరీ భాగ్యనగరం బయటకు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తరిమారు. అలాగే రెండేండ్ల క్రితం ట్రంప్‌ కూతురు ఇవాంకా హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ సర్కారు అదే ఫార్ములాను అమలుచేసింది