అత్యంత ప్రజాదరణతెలంగాణరాజకీయాలు

హమ్మయ్యా.. హైదరాబాద్ కు బీజేపీ ఒకటి సాధించింది

Hyderabad Regional Ring Road

బడ్జెట్ లో తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందని అటు టీఆర్ఎస్, ఇటు ప్రజలు అందరూ విమర్శిస్తున్న వేళ.. నిన్నటిదాకా గర్జించిన రాష్ట్ర బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి, డీకే అరుణలాంటి గొంతులు మూగబోయాయి. కానీ ఇప్పుడు ఎలాగోలా కష్టపడి.. సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఎట్టకేలకు తెలంగాణకు ఒకటి సాధించాడు. దీంతో ఈ ఒక్కదాన్ని మేం సాధించాం హుర్రే అంటూ తెగ ప్రచారం చేస్తున్నారు. అదేంటో తెలుసా.. ‘హైదరాబాద్ కు రీజినల్ రింగ్ రోడ్డు’.

Also Read: ఎన్నికల అక్రమాలు.. పోటెత్తిన ప్రజానీకం

ప్రజలు అనేక కష్టాలతో సతమతమవుతున్నారు. పెట్రోవాత, ధరాఘాతంతో సామాన్యుడి నడ్డి విరుగుతోంది. కేంద్రంలోని బీజేపీ షాకులు ఇవ్వడం తప్పితే వరాలిస్తుందా అని అందరూ ఆశ్చర్యపోతున్న వేళ మొత్తానికి హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.

ఈ మేరకు కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. సోమవారం కిషన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర బీజేపీ నేతల బృందం కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసింది. రీజినల్ రింగ్ రోడ్డుకు అన్ని అనుమతులు మంజూరు చేయాలని బృందం గడ్కరీని కోరింది. కేంద్రమంత్రి వెంటనే అంగీకరించడంతో హైదరాబాద్ నగరానికి మరో మణిహారం వచ్చినట్టైంది.

హైదరాబాద్ నగరానికి 50 నుంచి 70కి.మీల దూరంలో ఓఆర్ఆర్ కి 30కి.మీల దూరంలో ఈ రహదారి నిర్మాణం జరుగనుంది.సుమారు 20కిపైగా ముఖ్యనగరాలు, పట్టణాలను కలుపుతూ నిర్మాణం జరుగనున్న ఈ రహదారితో 40శాతం మంది ప్రజలకు రింగురోడ్డు ఉపయుక్తంగా ఉండనుంది.

Also Read: మానవత్వం మరుస్తున్నారా..?: మనుషుల్లో స్పందన ఎందుకు కనిపించట్లే..!

మొదటి దశలో సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు 158 కి.మీల మేర నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. రూ.9522 కోట్లు నిర్మాణ వ్యయంగా నిర్ణయించారు. రెండోదశలో చౌటుప్పల్-సంగారెడ్డి మధ్య 182 కి.మీల మేర నిర్మాణం చేపట్టనున్నారు. రెండు దశలకు కలిపి 17వేల కోట్లు హైదరాబాద్ కోసం కేంద్రం ఖర్చు చేయనుంది.. హైదరాబాద్ కు వచ్చే అన్ని హైవేలను ఇది కలుపుతుంది. అయితే ట్విస్ట్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ భూసేకరణ పనులను మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరగా ప్రారంభించాలని కిషన్ రెడ్డి కోరారు. ఖరీదైన భూములను సేకరించడం అంత ఈజీ కాకపోవడంతో ఈ బాధ్యతను కేసీఆర్ సర్కార్ పై పెట్టారు. దీంతో అసలు భూసేకరణ కష్టమన్న ప్రచారం సాగుతోంది. ఈప్రాజెక్ట్ పట్టాలెక్కడం కష్టమేనంటున్నారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

Back to top button