ప్రత్యేకంవిద్య / ఉద్యోగాలు

నిరుద్యోగులకు ఈసీఐఎల్ శుభవార్త.. రూ.23 వేల వేతనంతో ఉద్యోగాలు..!

ECIL Jobs

ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 19 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈసీఐఎల్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. బీటెక్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. http://www.ecil.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

Also Read: తెలంగాణ ఆర్టీసీ శుభవార్త.. అప్రెంటిస్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం..?

ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 31వ తేదీలోగా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ పద్దతిలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 23 వేల రూపాయల వరకు వేతనం లభిస్తుంది. వెబ్ సైట్ లో కెరీర్స్ అనే ఆప్షన్ ను ఎంచుకుని ఆ తరువాత ఈ రిక్రూట్ మెంట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి వివరాలను నింపి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

Also Read: ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. ఏమిటంటే..?

దరఖాస్తు చేసిన తరువాత వివరాలను నింపిన ఫామ్ ను ఒక ప్రింట్ తీసి దాచుకోవాల్సి ఉంటుంది. బీఈ లేదా బీటెక్ లో కనీసం 60 శాతం మార్కులతో పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిభ, అనుభవం బట్టి ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో 1 : 5 నిష్పత్తిలో అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి వర్చువల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ చేపడతారు.

మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

ఈసీఐఎల్ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. 2020 సంవత్సరం డిసెంబర్ 31 నాటికి 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Back to top button