ఆంధ్రప్రదేశ్విద్య / ఉద్యోగాలు

ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు చెప్పిన జగన్ సర్కార్..?

Jagan Sarkar says sweet words to government employees ..?

2019 ఎన్నికల్లో 151 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల్లో మంచి పేరు, గుర్తింపు సంపాదించుకుంటోంది. కోర్టు కేసుల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తున్నా ప్రజల్లో, ఉద్యోగుల్లో వ్యతిరేకత రాకుండా ప్రభుత్వం పాలనాపరమైన నిర్ణయాలను తీసుకుంటోంది. తాజాగా జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుని రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.

Also Read : వైఎస్ వివేకా హత్య: కీలక సమాచారం చెప్పిన ఆ ఇద్దరు మహిళలు?

2016 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల డిపార్ట్‌మెంట్‌ పరీక్షల్లో నెగిటివ్ మార్కుల విధానం అమలులో ఉండేది. నెగిటివ్ మార్కుల విధానం వల్ల ప్రతిభ ఉన్నా చాలామంది పదోన్నతులు పొందలేక పోయేవారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగులు సైతం నెగిటివ్ మార్కుల విధానాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల అభ్యర్థనలను తోసిపుచ్చింది. అయితే జగన్ సర్కార్ మాత్రం ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేకూరేలా చేసింది.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చైర్మన్‌ వెంకట్రామిరెడ్డి డిపార్ట్‌మెంట్‌ పరీక్షల్లో నెగిటివ్ మార్కుల తొలగింపుకు సంబంధించిన ఫైల్ పై ఇప్పటికే సీఎం జగన్ సంతకం చేశారని త్వరలో ఈ నిర్ణయం అమలులోకి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. సాధారణ పరిపాలన శాఖ సర్వీసుల విభాగం ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ ఏపీపీఎస్సీ పరీక్షల్లో నెగిటివ్ మార్కింగ్ ఉండబోదంటూ ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు చెప్పారు.

రాష్ట్రంలో మొదట నెగిటివ్ మార్కింగ్ విధానం అమల్లో ఉండేది కాదు. టీడీపీ 2016లో ఈ విధానాన్ని అమలులోకి తెచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు ఈ విధానాన్ని రద్దు చేయాలని కోరినా టీడీపీ పట్టించుకోలేదు. ఈ పరీక్షల్లో పాస్ కాని వారికి ఇంక్రిమెంట్లలో సైతం కోత పడుతోంది. దీంతో పలువురు ఉద్యోగుల ద్వారా ఈ సమస్య జగన్ దృష్టికి చేరగా సీఎం జగన్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకున్నారు.

Also Read : అలెర్ట్: మరో 24 గంటలు.. తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక

Back to top button