టాలీవుడ్సినిమా

‘అల’పై కన్నేసిన కండల వీరుడు

అల్లు అర్జున్ తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో’ భారీ విజయం సాధించింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ‘అలవైకుంఠములో’ అల్లు అర్జున్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. తెలుగు, మలళయాళంతోపాటు ఓవర్సీస్ లోనూ మంచి కలెక్షన్లు రాబట్టింది. టాలీవుడ్లో హిట్టయిన ప్రతీ మూవీ బాలీవుడ్లో రీమేక్ అవడం షారా మామూలుగా మారింది. దీంతో ఈ మూవీని కూడా నిర్మాత అల్లు అరవింద్ బాలీవుడ్లో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ మూవీపై బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కన్నేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ హక్కులను దక్కించుకునేందుకు సల్మాన్ భాయ్ ప్రయ్నతాలు చేస్తున్నాడని తెలుస్తోంది. అయితే అల్లు అరవింద్ తానే ఈ మూవీని బాలీవుడ్లో నిర్మించాలని భావిస్తున్నాడు. అయితే ఈ మూవీలో సల్మాన్ నటిస్తాడని ప్రచారం జరుగుతుంది.

సంక్రాంతి కానుకగా వచ్చిన ‘అలవైకుంఠపురములో’ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరునికెవ్వరు’, రజనీకాంత్ నటించిన ‘దర్బార్’ మూవీలను తట్టుకొని నిలబడింది. రోజురోజుకు పాజిటివ్ టాక్ పెంచుకొని దాదాపు 200కోట్లు కలెక్షన్లు రాబట్టిందని అంచనా. అదేవిధంగా తెలుగులో నాన్ బహుబలి రికార్డును ఈ మూవీ పేరిట లిఖించుకుంది. అదేవిధంగా యూఎస్ లోనూ 3మిలియన్ ప్లస్ వ్యూస్ తో భారీ కలెక్షన్లు సాధించింది. దీంతో బాలీవుడ్ దృష్టి ఈ మూవీపై పడింది. ఇప్పటికే తెలుగులో భారీ విజయం సాధించిన మూవీలు బాలీవుడ్ లోనూ సూపర్ సక్సస్ సాధించాయి. త్వరలోనే ‘అలవైకుంఠపురములో’ మూవీ బాలీవుడ్ ప్రేక్షకులను అలరించనుంది.

ఇప్పటికే తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ‘అర్జున్ రెడ్డి’ మూవీ బాలీవుడ్లో ‘కబీర్ సింగ్’గా రీమేకై కలెక్షన్ల సునామీ సృష్టించింది. అలాగే నాని నటించి ‘జెర్సీ’మూవీ కూడా ఇటీవలే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. లారెన్స్ ‘కాంచన’ మూవీ కూడా బాలీవుడ్ ప్రేక్షకులను అలరించనుంది. ఈ మూవీలో అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ‘అలవైకుంఠపురములో’ మూవీలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ మూవీని హిందీలోనూ నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తాడని తెలుస్తోంది.