ఆంధ్రప్రదేశ్టాలీవుడ్తెలంగాణరాజకీయాలుసినిమా

వాలెంటైన్స్ డే ఎలా మొదలైంది..? దీని చరిత్ర ఏంటి.. ?

 

అసలు ఈ వాలెంటైన్స్ డే ఎలా మొదలైంది ? దీని చరిత్ర ఏంటి ? ఇది తెలియాలి అంటే మనం ఒకసారి రోమన్ కాలం నాటికి వెళ్ళాల్సిందే… చరిత్ర ప్రకారం వాలెంటైన్స్ డే అనేది రోమన్ కాలం నుండి ఉన్నదని చెబుతారు. ఆ కాలంలో యుద్ధ సమయంలో పురుషులు ఎవరు స్త్రీలని వివాహం చేసుకోకూడదు అనే నిబంధన ఉండేది. ఈ నిబంధనను అప్పటి చక్రవర్తి క్లాయూడీఎస్ 2 ఆమోదించడం జరిగింది.

కానీ, వాలెంటైన్ అనే మత గురువు ప్రేమికులకు రహస్యంగా పెళ్లిళ్లు జరిపించేవారు. ఎప్పుడైతే రాజుకు ఈ విషయం తెలిసిందో వాలెంటైన్ ని జైలులో నిర్బంధించారు. జైల్లో ఉండగా వాలెంటైన్ ఆ జైలు అధికారి కుమార్తెతో స్నేహం చేసాడు.

అయితే జైలు అధికారి కుమార్తెకు కళ్ళు లేవు, ఆమెకు కళ్ళు తెప్పించడానికి వాలెంటైన్ చనిపోయాడని చరిత్ర చెప్తుంది. వాలెంటైన్ చనిపోయే ముందు ఆమెకు ఒక ఉత్తరం రాసాడు అందులో ” మీ వాలెంటైన్ నుండి ” అని సంతకం చేసి ఉంటుంది. ఈ సంఘటన ఫిబ్రవరి 14 వ తేదీన జరిగింది.

ఈ విధం గా వాలెంటైన్, ప్రేమికుల కోసం జైలుకి వెళ్లి, స్నేహం కోసం చనిపోవడంతో అతనికి గుర్తుగా హెన్రి VII అనే ఇంగ్లాండ్ కు చెందిన రాజు, ఫిబ్రవరి 14 వ తేదీని సెలవు దినంగా ప్రకటించి, ఈ రోజుని వాలెంటైన్స్ డే గా జరుపుకోమని అధికారికంగా చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఫిబ్రవరి 14 న ప్రేమికుల రోజుగా జరుపుకుంటున్నారు.