గుసగుసలు

మహేష్ బాబుని అవమానించిన త్రివిక్రమ్ శ్రీనివాస్

మహేష్ బాబు హీరోగా “సరిలేరు నీకెవ్వరూ” అల్లు అర్జున్ హీరోగా “అల వైకుంఠపురంలో” సినిమాలు ఈ సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని సాధించాయి. ఈ రెండు సినిమాలలో మహేష్ బాబు సినిమా కన్నా అల్లు అర్జున్ సినిమా కాస్త మెరుగ్గా ఉందని ట్రేడ్ విశ్లేషకులు తేల్చేశారు. కానీ రెండు అంత సూపర్ హిట్ సినిమాలైతే కావు. ముందుగా ఈ సినిమాల విడుదల సందర్భంలో చివరి వరకు ఉత్కంఠత నెలకొని ఉంది.

తన సినిమా కన్నా రెండు రోజులు తరువాత రావాలని మహేష్ బాబు “అల వైకుంఠపురం” నిర్మతలకు కబురు పెట్టడం వారు ససేమీరా ఒప్పుకోకపోవడం మధ్యవర్తులు సర్ది చెప్పడం అన్ని జరిగిపోయి ముందు అనుకున్న డేట్స్ కే విడుదల చేశారు. సినిమా విడుదలై విజయం సాధించడంతో “అల వైకుంఠపురంలో” నిర్మతలు నిన్న విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ సచిన్ కు ఫుల్ టాస్ వేస్తే ఏమవుతుందో తెలుసా అంటూ ఇన్ డైరెక్ట్ గా పేరు చెప్పకపోయినా మహేష్ బాబు సినిమాకు పంచ్ వేసాడు.

Comment here