మిర్చి మసాలారాజకీయాలు

అమరావతి – అయోమయంలో బిజెపి

గత నాలుగు రోజులనుండి, ఆంధ్రాలో, అందరూ అమరావతి గురించే మాట్లాడుకుంటున్నారు. బొత్స సత్యనారాయణ గారి ప్రకటనలతో ఈ ప్రహసనం మొదలయింది. ఆయన ముఖ్యంగా రెండు విషయాలు ప్రస్తావించారు. ఒకటి, అమరావతిలో గత ప్రభుత్వం చేసిన అవినీతి, రెండోది ముంపు ప్రాంతంలో అమరావతిని నిర్మించటంవలన జరిగే నష్టం. మొదటి విషయానికి వస్తే, ప్రతి ప్రభుత్వం చేసినట్లుగానే, తెలుగుదేశం తన హయాంలో రాజధానిని అతిగా రాజకీయయం చేసింది. ప్రజలందరికి తెలుసు అక్కడ కాపిటల్ నిర్మాణం పేరుతొ జరిగింది రియల్ ఎస్టేట్ వ్యాపారం అని . ఐదేళ్లు ఆ ప్లాన్, ఈ ప్లాన్ అని కాలం వెళ్లబుచ్చారు. ఈ ఐదేళ్లలో రెండు తాత్కాలిక భవనాలు మాములుగా అయ్యే ఖర్చు కన్నా 3 రేట్లు ఎక్కువ వ్యయంతో కడితే, అది వర్షం వస్తే ఉండటానికి వీల్లేకుండా, మీడియా యాక్టీవ్గా ఉన్న ఈరోజుల్లో ప్రజలు అంత అమాయకులు కాదు. చంద్రబాబు నాయుడు గారు తాను ఇప్పటికి ఎందుకు ఓడిపోయానూ అర్ధం కావటల్లేదు అంటారు. ప్రజలందరికి అర్ధం అయినా ఆయనకు మాత్రం అర్ధం కావట్లేదు పాపం.

బీజేపీ విషయానికి వస్తే, తెలుగు దేశం నుండి విడిపోయినాక, ఎన్నికలకు ముందు వరకు టీడీపీ అవినీతి మీద అంతా – ఇంతా రాద్ధాంతం కాదు చేసింది. కాపిటల్ విషయం ఐతేనేమి, పోలవరం విషయంలో కానీ టీడీపీ పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయింది అని గగ్గోలు పెట్టారు. ఎన్నికల తర్వాత టీడీపీ రాజ్యసభ సభ్యులంతా కలసి బీజేపీ లో చేరిన తర్వాత ఆంధ్రాలో బీజేపీ కులాల వారీగా, ప్రాంతాలవారీగా విడిపోయింది. అసలు బీజేపీ సౌత్ ఇండియా లో అన్ని రాష్ట్రాల్లో అన్నీ తప్పులే చేస్తుంది. సరే ఆవిషయాన్ని ఇంకోసారి చర్చిద్దాం. ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ లో సుజనా చౌదరి చేరిన తర్వాత చేరక ముందుగా చెప్పుకోవాలి. ఇప్పుడు బీజేపీలో ఒక వర్గం క్యాపిటల్లో అసలు ఏమీ అవినీతి జరగలేదని , మరొక వర్గం అంతా అవినీతే జరిగిందని వాదిస్తున్నారు. తెలివిగా YSRCP మాత్రం కొన్ని ఫీలర్లు వదిలి, ప్రజలు ఏమనుకుంటున్నారో తమాషా చూస్తుంది. నాకు తెలిసి ఎంత మోడీ ప్రభావం ఉన్నా, ఆంధ్రాలో బీజేపీ తన ఉనికిని చాటుకోవాలంటే ఒకే మాటతో ఉండాలి, డబ్బులున్న వాళ్ళు నిన్న గాక మొన్న వచ్చిన వాళ్ళు పెత్తనం చేస్తుంటే , ప్రజలు అంత అమాయకులు కాదు.

Tags
Show More
Back to top button
Close
Close