ప్రవాస భారతీయులు

కరోనా వైరస్ సోకి మలేషియాలో చనిపోయిన భారతీయుడు

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ సోకి మలేషియాలో నివసిస్తున్న ఒక భారతీయుడు చనిపోయాడు. వివరాలలోకి వెళితే … త్రిపుర రాష్ట్రానికి చెందిన మానీర్ హోస్సేన్ కరోనావైరస్ సోకి మలేషియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మానీర్ హోస్సేన్ 2018లో ఓ రెస్టారెంట్ లో పనిచేసేందుకు మలేషియా వెళ్లాడు.అక్కడ కరోనా వైరస్ తో మానీర్ చనిపోయినట్లు అక్కడి అధికారులు అతని తాతయ్యకి తెలియజేశారు.తన మనవడు రెండేళ్ల క్రితం మలేషియా వెళ్లి అక్కడ పనిచేస్తూ కరోనా వైరస్ సోకి చనిపోయాడని అతని తాత అబ్దుల్ రహీం తెలియజేశారు.అతని మృతదేహాన్ని ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.

Back to top button