తెలంగాణమిర్చి మసాలారాజకీయాలు

కొత్త రెవిన్యూ చట్టంతో కొత్త కష్టాలు.. ఎందుకంటే..

పూర్వం పటేల్, పట్వారీ వ్యవస్థ అమలులో ఉండేది.. ఆ వ్యవస్థను రద్దు చేసి ఇప్పుడున్న తహసీల్ధార్, వి ఆర్ ఓ వ్యవస్థను తీసుకొచ్చారు. దింతో భూ పరిపాలన వ్యవస్థ, రెవిన్యూ శాఖతో ముడిపడి పనిచేయాల్సి వచ్చింది. అందువల్ల రైతులు వారి భూముల రిజిస్ట్రేషన్ విషయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులను తొలగించడానికే “భూ పరిపాలన వ్యవస్థ” ను “రెవిన్యూ శాఖా” నుంచి వేరు చేయాలన్నదే.. కెసిఆర్ సర్కార్ ఆలోచన.

వివరాల్లోకి వెళ్తే.. కెసిఆర్ మొదటిసారి అధికార పీఠం ఎక్కిన తరవాత కొత్త పంచాయితీ వ్యవస్థను తీసుకొచ్చి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. అయితే ఈసారి మరో కీలక నిర్ణయం తీసుకోనుంది తెరాస సర్కార్. “భూ పరిపాలన వ్యవస్థను రెవిన్యూ శాఖ నుండి వేరు చేసి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థకు అప్పగించాల”ని కెసిఆర్ సర్కార్ యోచిస్తోంది.

ఈ చట్టం ప్రకారం భూ యజమానికే సర్వ హక్కులు ఉంటాయి. రిజిస్ట్రేషన్ కంటే ముందే భూ వివాదాలు ఏమైనా ఉంటే స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న వ్యవస్థ తో మాట్లాడి ఆ గొడవలను సరిచేసుకోవాలి. అలాగే రిజిస్ట్రేషన్ చేసే సమయంలో తహసీల్ధార్ కు సబ్ రిజిస్టార్ కు సంబంధం ఉండదు. రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఆ భూమి కి రక్షణ కల్పించడానికి వీలుగా ప్రత్యేక రుసుమును ప్రభుత్వమే చూసుకుంటుంది. ఆ రుసుమును భీమా రూపంలో జమ చేస్తారు. ఈ చట్టం ఏర్పాటు అమలు కోసం ఈ నెల 11 న కలెక్టర్ల తో సమావేశమై వారి సలహాలు తీసుకోవాలనుకుంటున్నారు కెసిఆర్.

అయితే ఈ కొత్త రెవిన్యూ చట్టం తెలంగాణాలో అమలుపరచడం అంత సులువు కాదు. ఎందుకంటే తెలంగాణాలో అరెకరం, ఎకరం భూమి కలిగిన రైతులే ఎక్కువుగాఉన్నారు. ప్రస్తుతం ఉన్న తహసీల్ధార్, వి ఆర్ ఓ వ్యవస్థను పక్కన పెడితే మరిన్ని కష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువ.