అంతర్జాతీయంవీడియోలువైరల్

తల్లిపై ప్రేమ:కారునడిపే వ్యక్తిపై గొడవకు దిగిన బుడ్డోడు

 

తల్లిని కారుతో గుద్దిన వ్యక్తి మీద యుద్దానికి దిగాడు ఓ బుడ్డోడు. కోపం వచ్చి కారును టపా టపా కాలితో తన్నాడు. కారునడిపే వ్యక్తిపై గొడవకు దిగాడు. ఓ పక్క అమ్మకు ఏమైపోయిందో అనే బాధ..కంగారు మరోపక్క కారు నడిపిన వ్యక్తిపై కోపం అమ్మ పడిపోయిందని బాధతో ఏడుస్తూనే కారు యజమానిపై విపరీతమైన ఆగ్రహాన్ని ప్రదర్శించిన ఈ బుడ్డోడి వీడియో సోషల్ మీడియాలో వైలర్ గా మారింది. సౌత్ చైనా పోస్ట్ పేరుతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

 

 

ఈ వీడియోలో… తల్లి కొడుకూ రోడ్డు దాటుతున్నారు. రోడ్డుపై వచ్చే కారుని గమనించకుండా పిల్లాడిని తీసుకుని కుడి వైపుకి చూస్తూ రోడ్డు దాటుతోంది తల్లి. ఈ క్రమంలో ఎడమ వైపు నుంచి వచ్చిన ఒక కారు ఆమెను ఢీకొట్టింది. దీంతో ఆమె కింద పడిపోయింది. ఆమె పక్కన ఉన్న తన కుమారుడు కూడా కింద పడిపోయాడు. కానీ వెంటనే లేచిన ఆ పిల్లాడు ఏడుస్తూ తన తన తల్లిని లేపి..దూకుడుగా కారు యజమాని మీద గొడవకు దిగాడు.

 

తల్లి గాయపరిచిన ఆ కారుని కాలి తో తన్నుతూ… కారులో నుంచి దిగు అంటూ డిమాండ్ చేశాడు. ఆ యజమాని పిల్లాడిని చూసి కారు దిగి ఆమెను తన కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లాడు. ఒక పక్కన తన తల్లిని లేపుతూ మరోపక్క గొడవకు దిగుతూ తల్లి మీద తనకు ఎంత ప్రేమ ఉందో చూపించాడు. ఈ వీడియో అక్కడ ఉన్న సెక్యురిటి కెమెరాలో రికార్డ్ అయింది. ప్రస్తుతం ప్రపంచాన్ని ఈ వీడియో ఊపేస్తోంది. చిన్న వయసులో తల్లి మీద అంత ప్రేమ పెంచుకున్న ఆ బుడ్డోడిని నెటిజన్లు ప్రశంసిస్తున్నాడు. అమ్మకోసం ఆ పిల్లాడి తపనను..చూస్తే ఎవ్వరికైనా..భలే పిల్లాడులే..అమ్మపై ఎంత ప్రేమ అనిపిస్తోంది.

Comment here