జాతీయం

తీరంలో ‘నిసర్గ’ అల్లకల్లోలం!

Nisarga Cyclone

అరేబియా సముద్రంలో నిసర్గ తుఫాను వేగంగా దూసుకొస్తోంది. రత్నగిరి తీరంలో ఇప్పుడు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. భారీ వర్షం కూడా పడుతోంది.

చుట్టూ మూడు సముద్రాలు ఉండటంతో… భారత్‌ కి తుఫాన్ల ముప్పు బాగానే ఉంటోంది. ఇటీవల అంఫన్ అలా వచ్చి వెళ్లగా… ఇప్పుడు అరివీర భయంకరంగా నిసర్గ తుఫాను వచ్చేస్తోంది. ఇది ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ తీరం దగ్గర ఉన్న హరిహరేశ్వర్ దగ్గర తీరం దాటుతుందని అంచనా వేశారు. అయితే.. ఇది చిన్న తుఫానేమీ కాదు. పైగా చాలా బలంగా ఉంది. ఇది తీరం దాటేటప్పుడు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంటున్నారు. అంటే తీవ్రత చాలా ఎక్కువే. చెట్లు కూలిపోయే ప్రమాదం ఉంది. కరెంటు స్తంభాలు ఒరిగే ఛాన్స్ ఉంది. ఇళ్ల పైకప్పులు కూడా ఎగిరిపోతాయని, సముద్రం ప్రస్తుతం అల్లకల్లోలంగా ఉందని అధికారులు అంటున్నారు.