బాలీవుడ్సినిమా

పాపం శ్రీదేవి చిన్న కూతురు.. సర్జరీల మీద సర్జరీలు !

Jhanvi Kapoor

అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురుగా జాన్వి కపూర్ కు పెద్దగా కష్టపడకుండానే స్టార్ డమ్ వచ్చేసింది. కోట్లు సంపాదిస్తోంది, పైగా పర్ఫెక్ట్ బాడీ స్ట్రక్చర్ తో జాన్వీ మంచి అందెగత్తెగా అలాగే ఎక్స్ పోజింగ్ కి ఏ మాత్రం మొహమాట పడని యంగ్ బ్యూటీగా ప్రస్తుతం ఫుల్ బిజీగా కెరీర్ ను కొనసాగిస్తోంది. అక్క సంపాదనను చూసిన శ్రీదేవి చిన్న కూతురు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు తెగ ఉత్సాహ పడుతుంది. శ్రీదేవి చిన్న కూతురుగా ఖుషీ కపూర్ కి గుర్తింపు ఉన్నా.. ఆమెలో అందం తక్కువ అనే కామెంట్స్ ఉన్నాయి.

అయినా, అక్క బాటలోనే నటిగా అరంగేట్రం చేయనుంది ఈ బ్యూటీ. నటన నేర్చుకునేందుకు ఖుషి అమెరికా వెళ్ళింది. న్యూయార్క్ లోని ఫేమస్ లీ స్ట్రాస్బెర్గ్ ఇనిస్టిట్యూట్ లో చేరింది. ఏడాది కోర్సు పూర్తి ఐన తర్వాత సినిమాల్లో నటిస్తుందని.. అలాగే అందం పై కూడా దృష్టి పెట్టిందని తెలుస్తోంది. ఇప్పటికే ఒక సర్జరీ కూడా చేయించుకుందట. కాకపోతే, ఇంకా పెదవి కింద మరో సర్జరీ చేయించుకునే ఆలోచనలో కూడా ఉందట. అలాగే బాడీకి సంబంధించి కూడా కొన్ని ప్లేస్ ల్లో ఆపరేషన్ చేయించుకుందట. మొత్తానికి 2022లో యాక్టింగ్ డెబ్యూ ఉంటుంది అని ఖుషీ చెప్తోంది.

మరి జాన్వీ కపూర్ ని కరణ్ జోహార్ హీరోయిన్ గా లాంచ్ చేశాడు కాబట్టి, ఆమె చెల్లెల్ని కూడా అతనే లాంచ్ చేస్తాడేమో చూడాలి. బోనీ కపూర్ తన కూతుళ్లతో సినిమాలు తీసేందుకు ఆసక్తి చూపడం లేదు, వేరే ప్రొడక్షన్ లో వాళ్ళు స్టార్స్ గా నిలబడితేనే పేరు వస్తుంది అనేది ఆయన అభిప్రాయంగా చెబుతున్నారు బాలీవుడ్ జనం. పైగా బోనీ ప్రస్తుతం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాడట. జాన్వీ కపూర్ మాత్రమే ప్రసుతం సంపాదిస్తోందట ఆయనగారి ఫ్యామిలిలో.

Back to top button