మిర్చి మసాలా

బాబుగారు దొరికేసారు…వీడియో చూపించి మరీ ఉతికేసారు!

 

ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి రద్దు చేయాలని అధికార పార్టీ ఈ రోజు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో…దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ టీడీపీ సభకు రాకుండా నిరసన తెలియ చేసింది. అయితే ఈ రోజు అసెంబ్లీలో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ… చంద్రబాబుది పాత వీడియో ఒకటి విడుదల చేసారు.

 

హైదరాబాద్ ప్రజలలో కలకలం రేపుతున్న కరోనా వైరస్

 

అది ఏంటంటే… 2004 లో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి శాసన మండలిని మళ్ళి రాష్ట్రంలో ప్రవేశ పెడుతున్న సమయంలో చంద్రబాబు ఎలా స్పందించారో అనేదే ఈ వీడియో.

 

ప్ర‌కాష్ రాజ్ కు డెత్ వార్నింగ్!

 

ఈ వీడియోలో….చంద్రబాబు అప్పటి ముఖ్యమంత్రి అయిన రాజశేఖర్ రెడ్డిని….మండలి రాష్ట్రానికి ఆర్ధిక భారమని…దాని వల్ల బిల్లులు ఆలస్యం అవుతాయని విన్నవించారు. ఇప్పుడు దీనికి విరుద్ధంగా మళ్ళీ ఆయనే మండలిని తీసేయటం మంచి పద్దతి కాదని చెప్పటం ఎంతవరకు సమంజసం.. ? అని అధికార పార్టీ మంత్రులు మరియు ఎమ్మెల్యేలు ప్రశిస్తున్నారు.

 

బైక్ నడుపుతూ స్నానం చేసిన యువకులు… వీడియో వైరల్

 

ఇలాంటివి ఏవో ఉంటాయని గ్రహించే ఈ రోజు చంద్రబాబు అసెంబ్లీకి రాలేదని సెటైర్లు వేస్తున్నారు. నిజమే కదా అప్పుడు మండలి ఎందుకు వద్దొ.. ఆయనే వివరించారు…మరల ఇప్పుడు వైసీపీ అవే చెప్పి తీసేస్తుంటే..ఇది ఒక పిచ్చి చర్య అని గోల చేస్తున్నారు. మరి ఈ మతలబు ఏమిటో…బాబుగారికే తెలియాలి.

 

Tags
Back to top button
Close
Close