ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య పై వదంతాలు!

వైఎస్ వివేకా హత్య కేసు కీలక మలుపు తిరిగింది. వివేకా హత్య సుపారీ హత్య గా సిట్ పోలీసులు తేల్చారు. కడప జిల్లా పొద్దుటూర్ కు చెందిన సునీల్ గ్యాంగ్ వైఎస్ వివేకా ను హత్య చేసినట్టు తేల్చారు. 800 మంది విచారణ తర్వాత పోలీసులు సునీల్ గ్యాంగ్ హత్య చేసినట్టు నిర్ధారణకు వచ్చారు. నిందితులు వాడిన బైక్ ఆధారం గా కేసు లో కీలక సాక్ష్యం లభ్యమైంది. శ్రీనివాస్ రెడ్డి సునీల్ గ్యాంగ్ కు వివేకా మర్డర్ డీల్ సెట్ చేసినట్లు తేల్చారు. శ్రీనివాస్ రెడ్డి అనుమానాస్పద మరణం తో అనుమానాలు పెరిగాయి.” అయితే ఇవన్నీ వందతాలని జిల్లా ఎస్పి అన్బురాజన్ అన్నారు.

మాజీ మంత్రి,ముఖ్యమంత్రి జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొందరు వదంతులు వ్యాపింప చేస్తున్నారని జిల్లా ఎస్పి అన్బురాజన్ అన్నారు. ఎలాంటి వదంతులను ప్రజలు నమ్మవద్దని ఆయన అన్నారు.గత కొన్ని రోజులుగా సునీల్ గ్యాంగ్ ఈ హత్యకు పాల్పడిందని ప్రచారం జరుగుతోందని ఆయన అన్నారు. అవన్ని వదంతులు అని ఆయన అన్నారు. ఎవరైనా అలాంటి అబద్దపు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని , అవాస్తవాలను ప్రచురించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Back to top button