సినిమా బ్రేకింగ్ న్యూస్

‘సర్కారి వారి పాట’ మొదలైంది..

Mahesh ‘Sarkari Vari Pata’ shooting begins today

మహేశ్ బాబు నటిస్టున్న ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ శనివారం ప్రారంభమైంది. మహేశ్ సతీమణి నమ్రతా శిరోద్కర్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా కూతురు సితార ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టింది. పరుశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ఎంటర్ టైన్ మెంట్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు ఇప్పటికే విడుదలవగా అభిమానులు,ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. దీంతో ఈ సినిమా ఎప్పడు మొదలవుతుందా..? అని అభిమానులు ఎదురుచూశారు. కరోనా తాకిడి లేకుంటే ఈ పాటికి సినిమా సగం షూటింగ్ జరుపుకునేది. శనివారం షూటింగ్ ప్రారంభం కావడంతో మహేశ్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

Back to top button