అత్యంత ప్రజాదరణటాలీవుడ్సినిమాసినిమా వార్తలు

Samantha, Naga Chaitanya : ‘బ్రేక‌ప్ స్టోరీ’ పెట్టేసిన స‌మంత.. ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌!

Samantha, Naga Chaitanya : తొలి సినిమాతోనే ప్రేమ‌లో ప‌డిన‌ అక్కినేని వార‌సుడు నాగ‌చైత‌న్య - స్టార్ హీరోయిన్ స‌మంత.. ఆ త‌ర్వాత అంగ‌రంగ వైభ‌వంగా పెళ్లి చేసుకున్నారు. అంతా హ్యాపీగా సాగిపోతున్న స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి షాకిచ్చింది సామ్‌. సోష‌ల్ మీడియాలో త‌న పేరు చివ‌ర ఉన్న అక్కినేని ప‌దాన్ని తొల‌గించి, సంచ‌ల‌నానికి తెర‌తీసింది.

Samantha, Naga Chaitanya : తొలి సినిమాతోనే ప్రేమ‌లో ప‌డిన‌ అక్కినేని వార‌సుడు నాగ‌చైత‌న్య – స్టార్ హీరోయిన్ స‌మంత.. ఆ త‌ర్వాత అంగ‌రంగ వైభ‌వంగా పెళ్లి చేసుకున్నారు. అంతా హ్యాపీగా సాగిపోతున్న స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి షాకిచ్చింది సామ్‌. సోష‌ల్ మీడియాలో త‌న పేరు చివ‌ర ఉన్న అక్కినేని ప‌దాన్ని తొల‌గించి, సంచ‌ల‌నానికి తెర‌తీసింది. ఇది చూసిన వాళ్లంతా స‌మంత‌-చైతూ మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయ‌ని, అక్కినేని పేరు తొల‌గించ‌డం అందులో భాగ‌మేన‌ని చ‌ర్చించుకోవ‌డం మొద‌లు పెట్టారు. ఆ విష‌య‌మై అటు స‌మంత గానీ.. ఇటు చైతూ కానీ స్పందించ‌లేదు. ఈ క్వ‌శ్చ‌న్ మార్క్ అలా కంటిన్యూ అవుతుండ‌గానే.. మ‌రో బ్రేక‌ప్ స్టోరీతో హాట్ టాపిక్ క్రియేట్ చేసింది సామ్.

2017లో ఒక్క‌టైన ద‌గ్గ‌ర్నుంచి వీరు జాలీగానే కాపురం కొన‌సాగించారు. ఆ మ‌ధ్య స‌మంత హోస్టుగా వ్య‌వ‌హ‌రించిన ‘సామ్ జామ్‌’ ఎపిసోడ్ కు సైతం నాగ చైత‌న్య వ‌చ్చేశాడు. వీరి ఎపిసోడ్ ఎంతగానో ఆక‌ట్టుకుంది. ఆ త‌ర్వాత కొన్ని రోజులకు ఏం జ‌రిగిందో తెలియ‌దు.. త‌న పేరు నుంచి అక్కినేని ఇంటి పేరును తొల‌గించింది. అభిమానుల‌తోపాటు ఇండ‌స్ట్రీ కూడా షాక్ అయ్యింది.

ఈ విష‌య‌మై ఈ మ‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూలో ప్ర‌శ్నించ‌గా.. ఇలాంటి వార్త‌ల‌పై తాను ఎప్పుడూ స్పందించ‌బోన‌ని చెప్పింది. ఇప్పుడు కూడా స్పందించాల‌ని అనుకోవ‌ట్లేద‌ని తెలిపింది. త‌న‌కు ఎప్ఉప‌డు మాట్లాడాల‌నిపిస్తే.. అప్పుడు మాట్లాడుతాన‌ని చెప్పింది. అంతేకాకుండా.. సినిమాల‌ను కాస్త బ్రేక్ తీసుకోవాల‌ని అనుకున్న‌ట్టు చెప్పిన సామ్‌.. అస‌లు విష‌యాన్ని మాత్రం చెప్ప‌లేదు. దీంతో.. ఫ్యామిలీ వివాదాన్ని చాలా మంది క‌న్ఫామ్ చేసుకున్నారు.

ఈ మ‌ధ్య ట్రోల్స్ పై ఇన్ స్టాలో ఓ పోస్టు చేసింది సామ్‌. ‘‘ట్రోల్స్ పై స్పందించ‌డం క‌న్నా.. వాటిని ప‌ట్టించుకోక‌పోవ‌డం మంచిది.’’ అన్న ఓ ర‌చ‌యిత కొటేష‌న్ ను పోస్టు చేసింది. తాజాగా.. ‘ది మోడ్ర‌న్ బ్రేక‌ప్’ అనే పేజీలోని పోస్ట్ ను షేర్ చేసి మరో సంచలనానికి తెరతీసింది సమంత.

‘‘మీ వెంట ఉన్నవారిపై మీరు చూపే ప్ర‌భావం మీకు ఎప్ప‌టికీ తెలియ‌దు. మీ చిరున‌వ్వు, ద‌య ఒక‌రి జీవితాన్ని ఎంత మ‌లుపు తిప్పిందో మీకు ఎప్ప‌టికీ తెలియ‌దు. సుదీర్ఘ‌మైన కౌగిలింత ఎంత అవ‌స‌ర‌మో మీకు తెలియ‌దు. కాబ‌ట్టి.. ద‌య‌గా ఉండ‌డానికి వెయిట్ చేయ‌కండి. ఇత‌రుల‌క‌న్నా ముందుగా మీరే ద‌య‌చూప‌డానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే.. ఆ ద‌య ఎవ‌రికి ఎంత అవ‌స‌ర‌మో మీకు తెలియ‌దు’’ అని పోస్టు చేసింది సామ్. దీంతో.. సమంత ఆవేద‌న‌లో ఉంద‌న్న విష‌యం అర్థ‌మ‌వుతోంద‌ని నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు. సాధ్య‌మైనంత త్వ‌రగా ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టి, మునుప‌టిలా ఉండాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Back to top button