తెలుగులో లోఫర్ సినిమా లో నటించిన దిశా పటాని ఇప్పుడు బాలీవుడ్ లో రాజ్యమేలుతోంది . తాజాగా సోషల్ మీడియా లో దిశా పటాని, ఆదిత్యరాయ్ ల సినిమా మాలాంగ్ పోస్టర్ హల్చల్ చేస్తోంది. ఈ పోస్టర్లో దిశా పటాని ఎంతో హాట్ కిస్ ఇస్తోంది. ఆ పోజు చూసిన వారికి దిమ్మ తిరిగి పోవాల్సిందే. ఈ పోస్టరును దిశా తన ట్విటర్ హేండిల్ లో పోస్ట్ చేసింది. దీనిని చూసిన వారికి ఇట్టే కిక్కు ఎక్కేలా వుంది. 2015లో వరుణ్ తేజ్ సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ వెళ్ళింది. అక్కడ ఎంఎస్ ధోని, ది అంటోల్డ్ స్టోరీ తదితర సినిమాలలో నటించింది. దీనితో పాటు పోతూ చైనీస్ కామిడీ సినిమా కుంగ్ ఫు యోగలో నటించింది. కాగా దిశా పటాని ముద్దు సీన్ చూసిన వారు చలి కాలం లో వేడి పుట్టించేదిగా ఉందని కామెంట్ చేసున్నారు.