తెలంగాణరాజకీయాలు

తెలంగాణలో 11జిల్లాలు ఫ్రీ!

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1016కు చేరుకుంది. ఇందులో 409 మంది డిశ్చార్జ్ కాగా,25 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 582 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.

వనపర్తి, వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. సిద్ధిపేట, మహబూబ్ నగర్, మంచిర్యాల, నారాయణ పేట, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూలు, ములుగు జిల్లాల్లో కేసులు నమోదు కావడం లేదు. ఈ జిల్లాల్లో కరోనా సోకిన వారందరూ చికిత్స పొంది పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఈ జిల్లాలను కరోనా ఫ్రీ జిల్లాలుగా సర్కార్ ప్రకటించింది. మరో 10 జిల్లాలు కూడా మే 3 వరకు కరోనా ఫ్రీ జిల్లాలుగా మారిపోనున్నాయి. దీంతో క్రమక్రమంగా తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గిపోతుంది.

Tags
Back to top button
Close
Close