జాతీయంరాజకీయాలు

అత్యవసర సేవలకు ఇక దేశవ్యాప్తంగా ఇదే నంబర్

112 emergency Numberదేశవ్యాప్తంగా అత్యవసర సమయాల్లో ఫిర్యాదు చేసేందుకు ఇంతవరకు 100 నెంబర్ ఉండేది. దాని స్థానంలో మరో నెంబర్ 112 ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై రెండేళ్ల క్రితమే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్రం ఆదేశాలు జారీ చేస్తోంది. పోలీసు శాఖ ప్రజల్లో అవగాహన పెరిగేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. రాబోయే రెండు నెలల వరకు 100 నెంబర్ అందుబాటులో ఉండనుంది. తరువాత 100కు కాల్ చేసినా 112 కు అనుసంధానం అయ్యేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

సామాజిక మాధ్యమాల ద్వారా 112 నెంబర్ చేరేలా చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రజలకు అర్థమయ్యేలా ప్రచార చిత్రాలు ఏర్పాటు చేయనున్నారు. తమిళనాడు,కర్ణాటక వంటి స్టేట్లు ఈ విషయంలో ముందున్నాయ. ఒకే సారి వంద మంది ఫోన్లు చేసినా స్వీకరించేలా పోలీస్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ కూడళ్ల వద్ద ప్లకార్డులు పట్టుకుని అవగాహన కల్పిస్తున్నారు. పోలీసు వాహనాలపై 112 స్టిక్కర్లు వేస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా అర్థమయ్యేలా 112 నెంబర్ గురించి ప్రచారం విరివిగా చేయనున్నారు. మహారాష్ర్ట అక్కడి ప్రజలకు అవగాహన కల్పించేందుకు సాంకేతికతను ఉపయోగించుకుని ముందుకు వెళుతోంది. ప్రస్తుతం దేశంలో అత్యవసర సేవలకు వివిద నెంబర్లు అందుబాటులో ఉన్నాయి. పోలీస్ స్టేషన్ కు అయితే 100, వైద్య సేవలకు అయితే 108, అగ్ని ప్రమాదాలకు 101 నెంబర్లను వాడుతున్నారు. ఈ నేపథ్యంలో 112 నెంబర్ పై విస్తృత ప్రచారం నిర్వహించాల్సి ఉంది.

ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన నెంబర్ 112కు అన్నింటిని అనుసంధానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విపత్తు నివారణ, గృహ హింస, వేధింపులు ఏదైనా అన్ని ఆపదలను ఒకే నెంబర్ పై పరిష్కరించేలా ప్రణాళిక రూపొందించాలని చూస్తోంది. వచ్చే అక్టోబర్ నాటికి దేశంలో అందరికి అందుబాటులో ఉండేలా చూడాలని కేంద్రం ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా ప్రచారం నిర్వహించి అందరిలో 112 నెంబర్ గుర్తుండిపోయేలా చర్యలు తీసుకుంటోంది.

Back to top button