తెలంగాణ బ్రేకింగ్ న్యూస్

జగిత్యాలలో 144 సెక్షన్‌.. జీవన్‌రెడ్డి హౌస్‌ అరెస్ట్‌..

144 Section impostiton in jatityala.

మక్కలను మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు చేస్తున్న ఆందోళన తీవ్రమవుతోంది. ఈ ఆందోళనలో భాగంగా జగిత్యాల కలెక్టరేట్‌ ఎదురుగా మహాధర్నాకు పిలుపునిచ్చారు కాంగ్రెస్‌ నేతలు. ఈ నేపథ్యంలో జగిత్యాల పట్టణంలో పాటు రూరల్‌ ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. ధర్నాలు, రాస్తారోకోలకు అనుమతి లేదన్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆయన నివాసం ఎదుట భారీగా పోలీసులు మోహరించారు. ఈసందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ మోదీ, కేసీఆర్‌లు వ్యాపారులకు లాభం చేకూర్చి రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కాగా నిన్న కామారెడ్డిలోనూ రైతులు ఆందోళన చేశారు.

Back to top button