2020 రౌండ్ అప్అత్యంత ప్రజాదరణతెలంగాణరాజకీయాలు

2020 తెలంగాణ పాలిటిక్స్.. క్లియర్ విన్నర్ బీజేపీనే..!

అధికార టీఆర్ఎస్.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలను వెనక్కి నెట్టి 2020లో ముందుకు దూసుకొచ్చిన బీజేపీ.

Telangana BJP

2020 ఏడాదంతా ప్రపంచం కరోనాతోనే పోరాడాల్సి వచ్చింది. కరోనా కాలంలోనూ నాయకులు రాజకీయాలు చేయడంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. కరోనాను కూడా పలు పార్టీలు తమ రాజకీయాలకు వాడుకోవడం కన్పించింది.

2020 రాజకీయాలను తెలంగాణలో పరిశీలిస్తే అధికార టీఆర్ఎస్.. ప్రతిపక్ష కాంగ్రెస్ కంటే బీజేపీ జోష్ చూపించింది. ఈ ఏడాది తొలినాళ్లలో వెనుకబడినట్లు కన్పించిన బీజేపీ 2020 చివరి నాటికి అన్ని పార్టీలను వెనక్కి నెట్టి క్లియర్ విన్నర్ గా నిలిచింది.

2020లో తొలుత మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏకపక్ష విజయాన్ని విజయం సాధించింది. దాదాపు 98మున్సిపాలిటీ టీఆర్ఎస్ దక్కించుకుంది. కారు హవా ముందు ప్రతిపక్షాలన్నీ బేజారయ్యాయి. దీంతో తెలంగాణలో టీఆర్ఎస్ కు ఎదురులేదని టాక్ విన్పించింది.

ఇక మధ్యలో నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానాన్ని కవిత గెల్చుకుంది. ఇకపోతే దుబ్బాక ఉప ఎన్నిక.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ చతికిలపడటం ఆ పార్టీకి అవమానంగా మారాయి. దీంతో ఈ ఏడాది మున్సిపల్లో సత్తాచాటిన టీఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల నాటికి పతనమైనట్లు కన్పించింది.

కాంగ్రెస్ పార్టీకి ఏడాది పెద్దగా కలిసి రాలేనట్లే కన్పిస్తోంది. గతేడాది మూడు పార్లమెంట్ సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ ఈ ఏడాది పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. మున్సిపల్.. దుబ్బాక.. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ కనీస పోటీ ఇవ్వలేక చతికిలపడింది. కాంగ్రెస్ అసలు పోటీలో ఉందా? అన్న అనుమానాలు వచ్చాయంటే ఆపార్టీ తెలంగాణలో ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.

2020 ఏడాది మాత్రం బీజేపీకి బాగా కలిసొచ్చింది. ఈ ఏడాది బీజేపీ ఫుల్ ఫామ్ లోకి రావడంతో ఆ పార్టీలో కొత్త జోష్ కన్పిస్తుంది. ఈ ఏడాది మొదట్లో మూడో స్థానానికే పరిమితమైన బీజేపీ అనుహ్యంగా ముందుకొచ్చింది.

2020 జనవరిలో మున్సిపల్ ఎన్నికలను బీజేపీ లక్ష్మణ్ హయాంలో ఎదుర్కొంది. ఆ ఎన్నికల్లో బీజేపీ పెద్దగా సత్తా చాటలేకపోయింది. ఆ తర్వాత కరీంగనర్ ఎంపీ బండి సంజయ్ పార్టీ పగ్గాలు చేపట్టాక  బీజేపీలో జోష్ నెలకొంది. నాటి నుంచి వరుస ఎన్నికల్లో బీజేపీ దూకుడు చూపిస్తోంది.

దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ గెలుచుకొని ఆ పార్టీకి గట్టి షాకిచ్చింది. ఈ గెలుపుతో తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం అనే సంకేతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగింది.

ఆ వెంటనే జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ టీఆర్ఎస్ కు ధీటుగా సీట్లు సాధించడం ఆ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. దీంతో ఆ పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. మొత్తంగా 2020 ఏడాదిలో బీజేపీనే క్లియర్ విన్నర్ గా నిలువడం విశేషం.

ఇదిలా ఉంటే 2020లో ఎదురుదెబ్బలు తిన్న పార్టీలు 2021లో సత్తాచాటాలని వ్యూహాలు రచిస్తున్నాయి. అలాగే 2020లో సత్తాచాటిన పార్టీలు సైతం ఇదే ట్రెండ్ ను 2021లో కొనసాగించాలని భావిస్తున్నాయి. దీంతో మున్ముందు తెలంగాణ రాజకీయాలు ఎలా మారుతాయనే ఆసక్తి అందరిలో నెలకొన్నాయి.

Back to top button