తెలంగాణ బ్రేకింగ్ న్యూస్బ్రేకింగ్ న్యూస్మిర్చి మసాలా

2,166.. తెలంగాణలో కరోనా కేసులు..

24 గంటల్లో 10 మంది మృతి

Carona india

తెలంగాణలో కరోనా కేసుల డిజిట్‌ పెరగడమే కానీ తగ్గడం లేదు. రోజు రోజుకు వైరస్‌ విస్తరించడంతో బాధితులు ఎక్కువవుతున్నారు. మరోవైపు మరణాలు సైతం తగ్గడం లేదు. తాజాగా మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం 2,166 కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 10 మంది మృతి చెందారు. దీంతో మొత్త పాజిటివ్‌ల సంఖ్య 1,74,774కి చేరగా మృతుల సంఖ్య 1,052కి చేరిసంది. ఇక ఒక్కరోజు 2,143 మంది డిశ్చార్జ్‌ అయినట్లు బులిటెన్‌లో పేర్కానరు. మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంలో 29,649 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Also Read: కోవిడ్ నిధులపై బండి-కేటీఆర్ కొట్లాట..!

Back to top button