ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

‘ఇఎస్ఐ’ విచారణలో జరిగేది ఇదేనా?


ఇఎస్ఐ స్కామ్ కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సహా మరో ముగ్గురు అధికారులను మూడు రోజులు పాటు ఏసీబీ కస్టడీకి తీసుకొని విచారించనుంది. అనారోగ్యం కారణంగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడు గుంటూరు ప్రభుత్వ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలోనే విచారించాలని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశించడంతో ఆక్కడ, ఆయన న్యాయవాది సమక్షంలో విచారించనున్నారు.

భారతీయులకు గుణపాఠం చెప్పిన ట్రంప్

ఈ స్కామ్ లో రూ.150 కోట్లు అవినీతి జరిగిందని అభియోగం మోపిన ఏసీబీ టెలీ మెడిసిన్ కాంట్రాక్టులు కేటాయింపు, చెల్లింపులు, మందులు, ఇతర పరికరాలు, ఫర్నిచర్ కొనుగోళ్ళలో అక్రమాలు చోటు చేసుకున్నామని వెల్లడించింది. ఈ అంశాలను విచారించేందుకు 35 ప్రశ్నలు సిద్ధం చేశారు. మరికొద్ది సేపట్లో విచారణ ప్రారంభించనున్నారు. మూడు రోజుల పాటు విచారణ జరగనుంది.

నిమ్మగడ్డ నిజాయితీపై నీలినీడలు

ఈ కేసులో అరెస్టు అయిన రమేష్ కుమార్ సహా మరో ఇద్దరు అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైల్ లో రిమాండ్ లో ఉన్నారు. వీరు ముగ్గురిని ఏసీబీ అధికారులు రాజమండ్రి జైలులోనే విచారించనున్నారు. ఈ స్కామ్ మంత్రి వత్తిడి వల్లే జరిగిందని అధికారులు గతంలో తెలిపారు. కాంట్రాక్టులు, టెండర్లు ఎవరెవరికి కెటయించాలనే విషయాన్ని మంత్రి తన లెటర్ హెడ్ పై రాసి ఇచ్చారని ఏసీబీ అధికారులు ప్రాధమిక విచారణలో నిర్ధారణ కు వచ్చారు. ఏసీబీ విచారణలో ఇఎస్ఐ అధికారులు మరోమారు ఇదే విషయాలను వెల్లడించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. వారు విచారణలో ఈ అంశాలనే వెల్లడిస్తే మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి ఈ కేసులో చిక్కులు తప్పకపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. మంత్రి ఇచ్చే వివరాలను పరిగణలోకి తీసుకుని ఏసీబీ అధికారులు ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

Tags
Back to top button
Close
Close