ఆరోగ్యం/జీవనం

ఏసీ వాడుతున్నారా.. విద్యుత్ బిల్లు ఆదా చేసే చిట్కాలివే..?

Save AC Electricity Bills

ఇతర కాలాలతో పోలిస్తే ఎండాకాలంలో ఎక్కువమంది ఏసీని వినియోగిస్తూ ఉంటారు. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందాలని అనుకుంటే ఏసీ వినియోగం తప్పనిసరి అని తెలిసిందే. అలా అని ఏసీని ఎక్కువగా వాడితే సాధారణంగా వచ్చే బిల్లు కంటే కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుంది. ఎక్కువ సమయం ఏసీని వినియోగించడం వల్ల ఏసీ సామర్థ్యం కూడా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Also Read: ఎత్తు పెరగాలనుకుంటున్నారా.. పాటించాల్సిన చిట్కాలు ఇవే..?

కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఏసీ శక్తి సామర్థ్యం తగ్గించకుండా ఉంచడంతో పాటు విద్యుత్ బిల్లును సులభంగా తగ్గించుకునే అవకాశాలు అయితే ఉంటాయి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ 24 డిగ్రీల దగ్గర డిఫాల్ట్ ఉష్ణోగ్రతను ఉంచాలని.. ఏసీ ఉష్ణోగ్రతను పెంచే ప్రతి డిగ్రీకి 6 శాతం చొప్పున విద్యుత్ ఆదా అవుతుందని వెల్లడించింది. ఏసీని 24 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర ఉంచడం వల్ల విద్యుత్ ను ఆదా చేయడంతో పాటు 300 రూపాయల నుంచి 400 రూపాయల వరకు కరెంట్ బిల్లును తగ్గించుకోవచ్చు.

Also Read: బరువు తగ్గేందుకు కొత్త విధానం.. తీసుకోవాల్సిన ఆహారాలివే..?

ఏసీని 23 డిగ్రీల నుంచి 24 డిగ్రీల మధ్య ఉంచినా రూమ్ కచ్చితంగా చల్లగా మారుతుందని చెప్పవచ్చు. ఏసీ వేయడానికి ముందు ఫ్రిజ్, టీవీ, కంప్యూటర్ లాంటి వస్తువులను ఆఫ్ లో ఉంచి ఏసీ ఆన్ చేసిన కొంత సమయం తరువాత వాటిని ఆన్ చేసుకుంటే మంచిది. రూమ్ త్వరగా చల్లబడాలంటే రూమ్ లోని ఫ్యాన్స్ తో పాటు లైట్స్ ను తప్పనిసరిగా ఆపివేయాలి.

ఏసీని ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఫిల్టర్ ను చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏసీలో దుమ్ము, ధూళి ఉంటే ఏసీ పని చేసే శక్తి తగ్గుతుంది కాబట్టి ఏసీని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏసీ పనితీరు బాగుండటంతో పాటు ఏసీ త్వరగా రిపేర్ అయ్యే అవకాశాలు అయితే ఉండవు.

Back to top button