అత్యంత ప్రజాదరణవిద్య / ఉద్యోగాలు

ఉద్యోగులకు మోదీ సర్కార్ శుభవార్త.. ఖాతాల్లోకి 1,40,000 వేలు..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. జూలై నుంచి డీఏ బకాయిలను ఉద్యోగులకు అందించడానికి మోదీ సర్కార్ సిద్ధమైంది. ఇలా చేయడం వల్ల ఉద్యోగులకు వేతనం భారీగా పెరగనుందని తెలుస్తోంది. ఈ నెల 26వ తేదీన మోదీ సర్కార్ ఇందుకు సంబంధించిన కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. డీఏ పెంపు, బకాయిల చెల్లింపు అంశాలపై ఈ సమావేశంలో మోదీ సర్కార్ నిర్ణయం తీసుకోనుంది.

2020 జనవరి 1 నుంచి 2021 జూన్ 30 వరకు ఉద్యోగులకు డీఏ అందనుందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం డీఏతో పాటు ఉద్యోగులకు 18 నెలల ఎరియర్స్ కూడా ఇవ్వాల్సి ఉండగా డీఏతో పాటు ఈ ఎరియర్స్ వస్తాయో లేదో తెలియదు. 7వ వేతన సంఘం ప్రకారం ఉద్యోగులకు అరియర్స్ రూపంలో ఏకంగా 1,40,000 రూపాయలు రావాల్సి ఉందని సమాచారం. ఎరియర్స్‌పై ఇంకా సందిగ్ధత నెలకొనగా జూన్ నెల 26వ తేదీన జరిగే సమావేశంలో ఇందుకు సంబంధించిన స్పష్టత రానుంది.

రూ.18 వేల నుంచి రూ.56 వేల బేసిక్ శాలరీ కలిగి ఉన్నవారికి 7వ వేతన సంఘం ప్రకారం రూ.18 వేల బేసిక్ పే ఉన్న వారికి రూ.11880 ఎరియర్స్, రూ.56 వేల బేసిక్ ఉన్న వారికి రూ.37,554 ఎరియర్స్ రావాల్సి ఉంటుంది. లెవెల్ 13, లెవెల్ 14 ఉద్యోగులకు మరింత ఎక్కువ మొత్తం ఎరియర్స్ వస్తాయని తెలుస్తోంది. పే స్కేల్ 14 ఉద్యోగులకు రూ.95 వేల నుంచి రూ.1,44,012 లభిస్తుందని సమాచారం అందుతోంది.

ప్రభుత్వం ఎరియర్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఉద్యోగులకు ఈ డబ్బు లభించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఎరియర్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే మాత్రం ఉద్యోగులకు ఈ డబ్బు ఎట్టి పరిస్థితుల్లోనూ లభించదు.

Back to top button