వ్యాపారము

ఉద్యోగులకు మోదీ సర్కార్ ఝలక్.. ఆ పెంపు లేనట్లే..?

7th Pay Commission Travel Allowance

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఉద్యోగులకు ప్రయోజనం చేకూరే విధంగా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం కేంద్రం జులై నెల నుంచి ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ చెల్లిస్తామని కీలక ప్రకటన చేసింది. డియర్ నెస్ అలవెన్స్ పెరుగుతున్న నేపథ్యంలో ట్రావెలింగ్ అలవెన్స్ కూడా పెరుగుతుందని ఉద్యోగులు భావించారు.

అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం జులై నెల నుంచి ట్రావెలింగ్ అలవెన్స్ ను పెంచబోదని సమాచారం. ప్రస్తుతం డియర్‌నెస్ అలవెన్స్ 17 శాతంగా ఉంది. డీఏ 25 శాతం లేదా అంత కన్నా ఎక్కువగా ఉన్నప్పుడే 7వ వేతన కమిషన్ పే మెట్రిక్స్ ప్రకారం ట్రావెలింగ్ అలవెన్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. డీఏ 17 శాతంగా ఉండటం వల్ల పెరిగే అవకాశాలు అయితే లేవని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

జూలై నుంచి డిసెంబర్ కాలానికి కేంద్రం డీఏ పెంపును ప్రకటిస్తే టీఏ పెరిగే అవకాశముందని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అయితే ట్రావెలింగ్ ఆలవెన్స్ పెరిగే అవకాశాలు అయితే లేవని తెలుస్తోంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా రాబోయే రోజుల్లో కీలక నిర్ణయాలు తీసుకోనుందని సమాచారం.

అయితే కేంద్రం ఎలాంటి నిర్ణయలు తీసుకోబోతుందో చూడాల్సి ఉంది. డియర్ నెస్ అలవెన్స్ ను పెంచుతూ ట్రావెలింగ్ అలవెన్స్ ను పెంచకుండా మోదీ సర్కార్ ఉద్యోగులకు ఝలక్ ఇచ్చిందనే చెప్పాలి.

Back to top button