తెలంగాణతెలంగాణ బ్రేకింగ్ న్యూస్బ్రేకింగ్ న్యూస్రాజకీయాలు

ఇక మాస్క్ లేకుండా తిరిగితే ఖతమే!

A huge fine for returning without a longer mask

దేశంలో కరోనా సెకండ్ వేవ్ వచ్చేసింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కూడా ప్రజల నిర్లక్ష్యం వల్ల ఈ వేవ్ వచ్చిందని చెప్పుకొచ్చాడు. దేశంలోని మహారాష్ట్రలో అయితే కేసుల తీవ్రత ఇంకా అధికంగా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి.

కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి చేస్తూ ధరించని వారికి జరిమానా విధించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది.

మాస్క్ పెట్టుకోకుండా తెలంగాణలో బయట తిరిగితే ఇక వారికి భారీ జరిమానాలు తప్పవు. ఈ మేరకు ప్రభుత్వం పోలీసులు, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధన ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణలో మాస్క్ ధరించకపోతే రూ.1000 జరిమానా విధించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. మాస్క్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. ముఖ్యంగా రోగనిరోధక శక్తి అధికంగా ఉండే యువత మాస్క్ పెట్టుకోవడం లేదని.. వారిపై అంటు వ్యాధుల చట్టం కింద కేసులు నమోదు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. చిన్నపిల్లలు, యువత తప్పనిసరిగా మాస్కు ధరించాలని.. 10 ఏళ్లలోపు .. 60 ఏళ్లు దాటిన వృద్ధులు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని వైద్యులు సూచిస్తున్నారు.

ఇక ఏపీలోనూ రూ.1000 జరిమానా అమలు చేస్తున్నారు. కర్ణాటకలో వివాహాలు, బహిరంగ సభలకు 500 మంది మించితే రూ.10వేలు జరిమానా విధిస్తున్నారు. ఢిల్లీలో మాస్క్ లేకుండా తిరిగితే జరిమానా రూ.2000కు పెంచింది. కేసులు అత్యధికంగా నమోదవుతున్న మహారాష్ట్రలో మాస్క్ లేకుంటే రూ.200 జరిమానా విధిస్తారు. ఒడిశాలో తొలిసారి మాస్క్ లేకుంటే రూ.2వేలు, మళ్లీ అదే తప్పు చేస్తే రూ.5వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

Back to top button