ఆంధ్రప్రదేశ్గుసగుసలురాజకీయాలువైరల్సంపాదకీయం

మంత్రితోనే మజాక్? ఆర్టీఏ అధికారికి వెరైటీ పనిష్మెంట్.!?

A joke with the minister? Variety Punishment for RTA Officer

ఏపీలో అధికారంలో ఉన్న మంత్రితోనే పెట్టుకుంటే ఏమవుతుంది.. బాక్సు బద్దలు అవుతుంది. ఏకంగా ఓ రవాణాశాఖ అధికారి మంత్రితోనే కయ్యం పెట్టుకున్నాడు. మంత్రి ఇచ్చిన వెరైటీ పనిష్మెంట్ కు గురయ్యాడట.. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని రోజుల కిందట రవాణాశాఖలో జరిగిన సంఘటనపై తీవ్ర చర్చ సాగుతోంది.

రవాణా శాఖలోని ఓ అధికారి చేసిన పనులకు సంబంధిత మంత్రి వేసిన ఫనిష్మెంట్ హాట్ టాపిక్ గా మారింది. తనకు ఎదురులేదు అనుకొని ఆ అధికారి చేసిన పనికి బాధితులు ఫిర్యాదు చేయడంతో మంత్రి బాధితుల పక్షాన నిలబడ్డారు. దీంతో ఆ మంత్రిపై ఓ వైపు ప్రశంసల జల్లు కురుస్తున్నా..అధికారుల్లో మాత్రం కలవరం మొదలైంది. అయితే ఆ అధికారి చేసిన పనేంటి..? ఎందుకు ఇలా మంత్రిచేతిలో బుక్ అయ్యాడు..? బాధితులు మంత్రిదాకా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చందనే దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది.

ఏపీలో రవాణా శాఖ మంత్రిగా ఉన్న పేర్ని నానిది ప్రత్యేక శైలి. తన పరిధిలోని అధికారులపై ఆయన నిక్కచ్చిగా ఉంటున్నాడట. రవాణాశాఖ ప్రజలతో సంబంధం కలిగి ఉంటుంది. అందువల్ల ప్రజలు ఈ శాఖ తరుపున ఏమైనా ఇబ్బందులు పడితే వెంటనే స్పందిస్తున్నాడట. ఎవరైనా అధికారులు ప్రజలకు అన్యాయం చేసినట్లు తన దృష్టికి వస్తే వెంటనే చర్యలు తీసుకునేందుకు సమాయత్తమవుతున్నాడట. దీంతో రవాణాఖాలోని ఉద్యోగులు తీవ్ర కలకలం రేపుతోంది.

తాజాగా విశాఖపట్టణంలో జరిగిన ఓ ఘటన రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ మధ్య విశాఖకు చెందిన కొందరు వాహన యజమానులు మంత్రి పేర్ని నానిని కలిశారట. తమకు ఓ అధికారి వలన తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గోడు వెళ్లబోసుకున్నారట. దాదాపు గంట సేపు జరిగిన ఈ భేటీపై మంత్రికి తమ సమస్యల గురించి ఫిర్యాదు చేశారు. విశాఖలోని ఓ ఉన్నతాధికారి తమను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారని వారి ఏకరువు పెట్టారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన మంత్రి సదరు అధికారిని అమరావతిలోని తన పేషీకి వచ్చి కలవాలని ఆదేశించారట. అయితే ఆ అధికారి తనను ఎందుకు పిలుస్తున్నారో తెలుసుకున్నాడట. అసలు విషయం తెలుసుకున్న సదరు అధికారి మంత్రిని కలిసిన వాహన యజమానులకు ఫోన్ చేసి మరీ బెదిరించాడట. అంతేకాకుండా ఆ యజమానులకు చెందిన వాహనాలు ఏ రూట్లో వెళ్లాయో తెలుసుకొని ఆ వాహనాలను భారీగా చలాన్లు వేశాడట.

తీవ్ర ఆవేదనకు గురైన ఆ వాహన యజమానులు మళ్లీ మంత్రిని కలిశారట. దీంతో సమస్యలను తీవ్రంగా పరిగణించిన మంత్రి ఆ అధికారి అమరావతికి పిలిపించుకున్నారు. ఇక్కడి ట్రాన్స్ పోర్టు కార్యాలయంలో నెల రోజుల పాటు అంటిపెట్టుకొని ఉంచాడట. ప్రతిరోజు సదరు అధికారి ట్రాన్స్ పోర్టు కార్యాలయానికి రావడం, కూర్చోవడం.. మధ్యాహ్నం భోజనానికి వెళ్లడం.. మళ్లీ ఖాళీగా కూర్చోవడం చేశారట. ఆ అధికారికి ఈ పని తప్ప వేరే పని అప్పగించలేదట. ఇలా ఆ అధికారికి పనులు అప్పగించకుండా ఫనిష్మెంట్ ఇచ్చాడట మంత్రి. అయితే మంత్రి రమ్మన్నగానే వచ్చి వివరణ ఇస్తే సరిపోయేది కదా.. అని కొందరు గుసగుసలాడుకుంటున్నారు.

Back to top button