జనరల్బిగ్ స్టోరీస్

77సార్లు ట్రాఫిక్ ఉల్లంఘించిన వ్యక్తి.. పోలీసులు ఏం చేశారంటే..?


ఈ మధ్య కాలంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. చాలామంది లైసెన్స్, సరైన సర్టిఫికెట్లు లేకుండానే వాహనాలను నడుపుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని చర్యలు చేపడుతున్నా కొందరు వాహనదారుల తీరు మాత్రం మారడం లేదు. కర్ణాటక పోలీసులు నిబంధనలు పాటించని వారి విషయంలో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ట్రాఫిక్ ఎక్కువసార్లు నిబంధనలు ఉల్లంఘించిన వారి జాబితాను తయారు చేశారు.

ఎక్కువసార్లు నిబంధనలను ఉల్లంఘించిన వారికి ఒకేసారి జాబితాను తయారు చేస్తున్నారు. జరిమానాలు చెల్లించకుండా ఆలస్యం చేసే వారినుంచి వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. బెంగళూరులోని మడివాలా ప్రాంతంలో ఉన్న అరుణ్ కుమార్ అనే కూరగాయల వ్యాపారి ఇప్పటివరకు 77సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారు. ట్రాఫిక్ పోలీసులు అతనికి 42,500 రూపాయలు జరిమానా విధించారు.

42,500 రూపాయల బిల్లు చెల్లించడానికి కారణాలను పేర్కొనడంతో పాటు ఏయే సందర్భాల్లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించాడనే వివరాలను పేర్కొన్నారు. జరిమనా చెల్లించడానికి అరుణ్ కుమార్ సమయం కోరగా పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. 70 సార్లు హెల్మెట్ నిబంధనలను ఉల్లంఘించిన మంజునాథ్ అనే మరో వ్యాపారికి 15,400 రూపాయలు జరిమానా విధించారు.

కేంద్రం కొన్ని నెలల క్రితం కొత్త ట్రాఫిక్ నిబంధనలను అమలులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. నిబంధనలను మార్చినప్పటికి నుంచి వాహనదారులు గతంతో పోలిస్తే భారీ మొత్తంలో జరిమానాలను చెల్లించాల్సి వస్తోంది.

Back to top button