వ్యాపారము

డెబిట్ కార్డ్ లేకుండానే డబ్బులు విత్ డ్రా.. ఎలా అంటే..?

Cash Withdrawal

దేశంలో టెక్నాలజీ రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఏటీఎంల నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకుంటున్నాం. కొన్ని బ్యాంకులు యాప్ ల సహాయంతో డబ్బులు విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అయితే మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అకౌంట్ ‌ ఉన్న బ్యాంకుకు సంబంధించిన యూపీఐ యాప్‌ సహాయంతో డబ్బు సులభంగా విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.

గూగుల్‌ పే, ఫోన్‌పే, పేటీఎంతో పాటు ఇతర యూపీఐ పేమెంట్ యాప్స్ ను ఉపయోగించి కూడా సులభంగా నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. షాపింగ్ చేసే సమయంలో క్యూఆర్ కోడ్ ను ఏ విధంగా స్కాన్ చేస్తామో ఏటీఎంలో క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి అదే విధంగా డబ్బులను విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని బ్యాంకులు కల్పిస్తున్నాయి. ఇంటర్‌ ఆపరెబుల్‌ కార్డ్ లెస్‌ క్యాష్‌ విత్‌ డ్రాయల్‌ విధానం త్వరలోనే అందుబాటులోకి రానుంది.

ఈ విధానం అందుబాటులోకి వస్తే ఏటీఎంలలో క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి డబ్బులు డ్రా చేసుకోవచ్చు. యూపీఐ యాప్ కు బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి ఉంటే డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు. సిటీ యూనియన్‌ బ్యాంక్ ఇప్పటికే 1,500 బ్యాంక్ ఏటీఎంలను అప్ గ్రేడ్ చేసి ఈ సర్వీసులను అందిస్తోంది. ఈ విధానంలో ఏటీఎం స్క్రీన్‌పై కనిపించే క్యూఆర్‌ కోడ్ ‌ను యూపీఐ యాప్ లో క్యూఆర్ కోడ్ స్కానర్ తో స్కాన్ చేయాల్సి ఉంటుంది.

ప్రస్తుతం సిటీ యూనియన్ బ్యాంకులలో ఈ సర్వీసులు అందుబాటులో ఉండగా త్వరలో మిగతా బ్యాంకులు కూడా ఈ సర్వీసులను కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Back to top button