వైరల్

ఫుల్లుగా తాగి ఓ కోడిని ఈ యువకుడు ఏం చేశాడంటే?

eat live chicken
మందేస్తూ చిందేసే కుర్రకారుకు కొదవ ఉండదు.. వీకెండ్ కు వచ్చిందంటే చాలు అందరూ బీర్లు, బిర్యాయాణీలు తీసుకొచ్చుకొని ఫుల్లుగా మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. హైదరాబాద్ వంటి మహానగరాలకే పరిమితమైన ఈ సంస్కృతి తాజాగా జిల్లాలకు విస్తరించింది.

Also Read: ఏపీ మంత్రి నానిపై హత్యాయత్నం.. ఎందుకు చేశాడంటే?

గ్రామాలు, పట్టణాలనే తేడా లేకుండా ఇప్పుడు అందరూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. గ్రామాల్లో అయితే సాయంత్రాలు అయితే చాలు కల్లు మండపాలన్నీ కళకళ లాడుతున్నాయి. ఫుల్లుగా కల్లు, బీర్లు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు..
ప్రస్తుతం ట్రెండ్ చూస్తే మందు తాగకపోతే వాడిని వెలేసినట్టు చూస్తున్నారు. మద్యం, సిగరెట్ ను ఫ్యాషన్ కు బ్రాండ్ గా యువత భావిస్తున్నారు. ఇక ఉద్యోగులు, వ్యాపారులు  కూడా రోజువారి బిజీ లైఫ్ రిలాక్స్ కోసం తాగుతుంటారు.. అసలు తాగని వాడు దున్నైపోతై పుట్టును అని కూడా మన మందుబాబులు వర్ణిస్తుంటారు.
ఇక తాజాగా  మద్యం ఫుల్లుగా సేవించాక ఒల్లు, కల్లు తెలియకుండా ఓ యువకుడు చేసిన పని వైరల్ గా మారింది.  మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు పచ్చి కోడినే పీక్కుతిన్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  వరంగల్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనని వీడియో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో అది కాస్తా వైరల్‌ అయింది.

Also Read: సమంతపై శ్రీరెడ్డి బోల్డ్ కామెంట్స్.. అలా వ్యాపారం చేస్తుందంటూ పోస్టు..!

మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు కోడిని ఖరీదు చేసి తీసుకెళ్తున్నారు. మత్తులో నడవలేని స్థితిలో ఆర్వోబీ సమీపంలో పడిపోయారు. ఇద్దరిలో ఓ యువకుడు చేతిలో ఉన్న కోడిని చంపి పచ్చిదే పీక్కుతిన్నాడు. దీన్ని కొందరు అక్కడే ఉన్న స్థానికులు వీడియో తీసి పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. యువకుడి మత్తు దిగాక కోడిని తిన్నాడు అనే బిరుదును కూడా ఇచ్చారట.. తాగితే ఇలాంటి అనర్థాలు కూడా చేస్తారా అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Back to top button