టాలీవుడ్సినిమా

స్టైలిష్‌ స్టార్+ సక్సెస్‌ఫుల్‌‌ డైరెక్టర్.. క్రేజీ కాంబో


రైటర్ నుంచి మెగాఫోన్‌ పట్టి ఫుల్‌ సక్సెస్‌లో దూసుకెళ్తున్న దర్శకుడు కొరటాల శివ. యూత్‌, మాస్‌ తో పాటు క్లాస్‌ ఆడియన్స్‌ను కట్టిపడేస్తూ ఫుల్‌ జోష్‌లో ఉన్న హీరో అల్లు అర్జున్‌. వీరిద్దరివీ భిన్న కోణాలు. సక్సెసే కాదు సెన్సిబుల్‌ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు శివ. సమకాలీన రాజకీయలపై పరిజ్ఞానం, సామాజిక స్పృహ ఉన్న అతి కొద్ది మంది డైరెక్టర్లలో ఒకడు. తన ప్రతీ సినిమాలో సమాజానికి ఏదో ఒక సందేశం ఇవ్వడం కొరటాల స్టయిల్. అదే టైమ్‌లో హీరోయిజాన్ని ఎలావేట్‌ చేయడంలో దిట్ట. కమర్షియల్‌ హంగులూ పర్ఫెక్ట్‌గా ఉండేలా చూసుకుంటాడు. పది బ్లాక్‌బస్టర్ హిట్స్ తీయడమే తన టార్గెట్‌ అని చెప్పే శివ.. ఇప్పటికే నాలుగు పూర్తి చేశాడు. మిర్చితో డైరెక్టరగా పరిచయమై ఫస్ట్‌ మూవీతోనే తన స్టామినా ఏంటో టాలీవుడ్‌కు చూపించాడు. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్‌, భరత్‌ అనే నేను మూవీస్‌ విజయాలు శివను సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్గా చేశాయి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘ఆచార్య’తో ఐదో హిట్‌ కొట్టే ప్రయత్నంలో ఉన్నాడు.

Also Read: బాలీవుడ్ హీరోయిన్ కావాలంటే ‘రష్మికా’ని తీసేయ్

మరోవైపు బడా నిర్మాత అల్లు అరవింద్‌ వారసుడిగా టాలీవుడ్‌లో ఈజీగానే ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ విజయాలు సాధిస్తున్నాడు. ట్రెండ్‌కు తగ్గట్టుగా బాడీని, బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకుంటూ టాలీవుడ్‌లో ఓ టాప్‌ హీరోగా వెలుగొందుతున్నాడు. యాక్టింగ్‌, డ్యాన్స్‌, ఫైట్స్‌లో తనదైన స్టయిల్‌ క్రియేట్‌ చేసుకున్న బన్నీ.. అన్ని వర్గాల ఆడియన్స్‌ మెప్పు పొందాడు. రీసెంట్‌గా ‘అల వైకుంఠపురములో’తో కెరీర్ బెస్ట్‌ హిట్‌ అందుకున్నాడు.

Also Read: ‘రొమాంటిక్’లో ‘ఎన్టీఆర్ అత్త’ !

‘నా పేరు సూర్య’ మినహాయిస్తే అల్లు వారి వారసుడు ఇప్పటిదాకా లవ్‌ స్టోరీస్‌, రొమాంటిక్‌ థ్రిల్లర్స్‌ మాత్రమే చేశాడు. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్‌లో ‘పుష్ప’లో గంధం చెక్కల స్మగ్లర్గా డిఫరెంట్‌ లుక్‌లో కనిపించబోతున్నాడు. ఇప్పుడు సోషల్‌ మెసేజ్‌ ఇచ్చే మూవీ చేయబోతున్నాడు. బన్నీ, కొరటాల శివ కాంబినేషన్లో మూవీ రాబోతోంది. దీనిపై శుక్రవారం అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చింది. బన్నీ స్నేహితులు సుధాకర్ మిక్కిలినేని, సాండీ, స్వాతి, నట్టీ ఈ మూవీకి ప్రొడ్యూసర్స్‌. ఈ పాన్‌ ఇండియా మూవీ 2022 మొదట్లో పలు భాషల్లో రిలీజ్‌ కానుంది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా బన్నీ ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. తన 21వ సినిమాను కొరటాలతో చేస్తున్నందుకు సంతోషంగా ఉందని, ఆయనతో పని చేసేందుకు ఆతృతగా ఉన్నానని ట్వీట్‌ చేశాడు. ఆచార్య, పుష్ప షూటింగ్స్‌ కంప్లీట్‌ అయిన తర్వాత ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. జోరుమీదున్న బన్నీ, శివ క్రేజీ కాంబో నుంచి పక్కా హిట్‌ ఆశించవచ్చు.

Tags
Show More
Back to top button
Close
Close