టెక్నాలజీ

Aadhar Mobile Number: ఆధార్‌తో లింక్ ఉన్న ఫోన్ నంబర్ల గురించి తెలుసుకోవాలా.. ఏం చేయాలంటే?

మనం ఆధార్ కార్డ్ తో లింక్ అయిన మొబైల్ నంబర్లను సులభంగా తెలుసుకోవచ్చు. టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాండ్ మేనేజ్మెంట్ అండ్ కన్జూమర్ ప్రొటెక్షన్

Aadhar Mobile NumberAadhar Mobile Number: ప్రస్తుతం మనకు ఎంతో ముఖ్యమైన కార్డులలో ఆధార్ కార్డు ఒకటనే సంగతి తెలిసిందే. అయితే చాలా సందర్భాల్లో ఆధార్ కార్డ్ దుర్వినియోగం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. . మనం ఆధార్ కార్డ్ తో లింక్ అయిన మొబైల్ నంబర్లను సులభంగా తెలుసుకోవచ్చు. టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాండ్ మేనేజ్మెంట్ అండ్ కన్జూమర్ ప్రొటెక్షన్ ఈ సదుపాయాన్ని అందిస్తుండటం గమనార్హం.

ఏపీ, తెలంగాణ వినియోగదారులు మాత్రమే ఆధార్ తో లింక్ అయిన మొబైల్ నంబర్ల గురించి తెలుసుకోవచ్చు. ఇందుకోసం మొదట https://tafcop.dgtelecom.gov.in/ వెబ్ సైట్ లింక్ ను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత వెబ్ సైట్ లో పది అంకెల మొబైల్ ఫోన్ నంబర్ ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ బటన్ పై క్లిక్ చేసి మొబైల్ ఫోన్ కు వచ్చిన వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాలి.

ఆ తర్వాత వెబ్ సైట్ ద్వారా ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నంబర్ల జాబితాను చూడవచ్చు. ఒకే ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డులను తీసుకున్నామో తెలుసుకోవచ్చు. ఒకవేళ ఆ నంబర్లలో వినియోగించని నంబర్ ఉంటే ఆ నంబర్ ను బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది. అదనపు మొబైల్ కనెక్షన్లను నియంత్రించుకునే అవకాశం ఉండటంతో వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది.

ట్రాయ్ అందిస్తున్న ఈ సర్వీసుల ద్వారా వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది. మీ పేరుతో పాటు మీ కుటుంబ సభ్యుల పేర్లపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయనే వివరాలను సైతం సులభంగా తెలుసుకోవచ్చు.

Back to top button