ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

ఉత్తరాది పెత్తనం.. మన మీడియా విలువ పతనం

ABP Desamతెలుగు మీడియా రంగం సమస్యలు ఎదుర్కొంటోంది. లాక్ డౌన్ నుంచి అన్ని రంగాలతో పాటు మీడియా కూడా నష్టాల్లోనే కొనసాగుతోంది. ఇన్నాళ్లు తెలుగు మీడియాలో ఏ పత్రిక, చానల్ అయినా తెలుగువారే ప్రారంభించే సంప్రదాయం ఉండేది. కానీ కాలక్రమేణా మన తెలుగు నేలపై ఉత్తరాది ప్రభావం పడుతోంది. ఇంతకుముందు ఏ సంస్థ అయినా ప్రారంభించేందుకు భారీ పెట్టుబడులు అవసరం కావడంతో తెలుగువారే ధైర్యంగా ముందడుగు వేసేవారు.

కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. అంతా డిజిటల్ రంగం వైపు మళ్లుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు మీడియాలో కూడా ఉత్తరాది వారి ఆధిపత్యం ఎక్కువవుతోంది. దీంతో అందరు నిరాశ చెందుతున్నారు. ఇటీవల తెలుగులో కొత్తగా ఆనందబజార్ పత్రిక గ్రూప్ ఆధ్వర్యంలోని ఏబీపీ గ్రూపు ప్రారంభమైంది. దీంతో ఉత్తరాది యాజమాన్యాల చేతుల్లోని మీడియా సంస్థలు డిజిటల్ మీడియాలో తమ ప్రభావం చూపుతున్నాయి.

దీంతో డిజిటల్ రంగాన్ని తన చెప్పుచేతల్లో ఉంచుకుంటోంది. ఏబీపీ తెలుగు మీడియా సంస్థలతో పోటీపడి తన ప్రాబల్యాన్ని పెంచుకుంటోంది. అత్యంత శక్తివంతమైన సాంకేతికతతో ఏబీపీ తెలుగు నేలపై తన మార్కెట్ ను విస్తరించుకుంటోంది. మన తెలుగు మీడియా సంస్థలను వెనక్కి నెడుతోంది. డిజిటల్ మీడియాపై పెరుగుతున్న మార్కెట్ తో సంప్రదాయ సంస్థలు వెనుకబడిపోతున్నాయి.

డిజిటల్ తో పోటీపడ లేక మూతపడుతున్నాయి. యాజమాన్యాల నిర్ణయంతో ఉద్యోగులు సైతం తమ ఉపాధి కోల్పోతున్న మాట వాస్తవమే. అయినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో రాబోయే రోజుల్లో తెలుగు మీడియా మరింత కష్టాల్లో పడే ప్రమాదం పొంచి ఉంది. ప్రభుత్వం స్పందించి తెలుగు మీడియా రంగాన్ని గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

రానురాను రాజుగారి గుర్రం గాడిదైందన్నట్లుగా మీడియా విలువలు తగ్గిపోతున్నాయి. గతంలో ఉన్న విలువలు ఇప్పుడు కనిపించడం లేదు. వార్తకు అంత ప్రాధాన్యం ఉండడం లేదు. వార్త ప్రాధాన్యాన్ని గమనించి దాని విలువను గుర్తించి దాపిై ప్రచారం చేయాల్సిన సంస్థలు ప్రాథమ్యాలను మరిచిపోతున్నారు. ప్రాధాన్యం లేని వార్తలను పెద్దగా చూపిస్తూ అత్యంత ప్రాధాన్యం ఇవ్వాాల్సిన వాటిని చిన్నగా వేస్తూ వార్తా ప్రాధాన్యాన్ని తగ్గిస్తున్నారు. దీంతో మీడియాపై సహజంగానే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా మీడియా స్పందించి తన మనుగడకు కాకుండా విలువలకు ప్రాధాన్యమిస్తూ వార్తలు సేకరించాల్సిన గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Back to top button