టాలీవుడ్సినిమాసినిమా వార్తలు

Chiranjeevi Birthday Poster : ‘మెగాస్టార్’ బర్త్ డే పోస్టర్ పై ఫ్యాన్స్ నిరుత్సాహం !

మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) పుట్టిన రోజు నాడు ఆచార్య నుండి అద్భుతమైన అప్ డేట్ రాబోతుంది అంటూ ఆశగా ఆసక్తిగా ఎదురు చూశారు ఫ్యాన్స్. పైగా ఎప్పుడెప్పుడు ఆచార్య (Acharya) ట్రైలర్ చూస్తామా అని కలలు కన్నారు అభిమానులు.

Chiranjeevi Birthday Poster from AcharyaMegastar Chiranjeevi Birthday: మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) పుట్టిన రోజు నాడు ఆచార్య నుండి అద్భుతమైన అప్ డేట్ రాబోతుంది అంటూ ఆశగా ఆసక్తిగా ఎదురు చూశారు ఫ్యాన్స్. పైగా ఎప్పుడెప్పుడు ఆచార్య (Acharya) ట్రైలర్ చూస్తామా అని కలలు కన్నారు అభిమానులు. అలాగే ఆచార్య విడుదల తేదీ విషయంలో క్లారిటీ లేదు, కాబట్టి చిరు బర్త్ డే నాడు ఆచార్య రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారని అంతా అనుకున్నారు.

కానీ. ఆచార్య టీమ్ మాత్రం, మెగాస్టార్ బర్త్‌ డే పోస్టర్‌ ను చాల సింపుల్‌ గా వదిలారు. పైగా గతంలో రివీల్ చేసిన లుక్ నే అటు ఇటు మార్చి ఒక పోస్టర్ గా వదిలారు. పోస్టర్ లో చిరు ఆకట్టుకున్నా.. మెగా ఫ్యాన్స్ కి మాత్రం ఈ పోస్టర్ ఏ మాత్రం కిక్ ఇవ్వలేదు. పైగా పోస్టర్‌ పై హ్యాపీ బర్త్‌ డే చిరంజీవి అంటూ వేయడం కూడా మెగా ఫ్యాన్స్ ను నిరుత్సాహపరిచింది.

కొంపతీసి ఇక ఇదే పోస్టర్ తో బర్త్ డేను సరిపెటేస్తారా అనే భయం పట్టుకుంది అభిమానుల్లో. అసలు అన్నీ సినిమాలు తమ విడుదల తేదీలను ప్రకటిస్తూ హడావుడి చేస్తుంటే.. ఆచార్య టీమ్ మాత్రం రిలీజ్ సంగతి గురించి పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. కనీసం మెగాస్టార్ అయినా రిలీజ్ విషయంలో స్పష్టత ఇస్తే బాగుంటుంది.

ఇక ‘కమర్షియల్ క్లాసిక్ డైరెక్టర్’ కొరటాల దర్శకత్వంలో వస్తోన్న ఈ ‘ఆచార్య’ ( Acharya) సినిమా పై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. చిరంజీవి కూడా ఈ సినిమా కోసం తన లుక్ ను పూర్తిగా మార్చుకున్నారు. అందుకే, ఈ చిత్రం విపరీతమైన బజ్ క్రియేట్ అయింది.

అన్నిటికీ మించి ఇది పాన్ ఇండియా సినిమా, అలాగే సినిమాలో చరణ్ నటిస్తున్నాడు. చరణ్ కి జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మెయిన్ హీరోయిన్ గా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. నిరంజన్‌ రెడ్డి, రామ్‌ చరణ్‌ కలిసి ఈ భారీ సినిమాని నిర్మిస్తున్నారు.

Back to top button