టాలీవుడ్సినిమాసినిమా వార్తలు

ఆచార్య టీజర్ రెడీ.. అదరిపోవడం ఖాయం !

Acharya Teaser
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో రానున్న ‘ఆచార్య’ సినిమా టీజర్ రిలీజ్ కానుంది. రేపు సాయంత్రం 4.05 గంటలకు టీజర్ రిలీజ్ కానుంది. తాజాగా టీజర్ రెడీ అంటూ చిత్రబృందం ఒక మేకింగ్ వీడియోను కూడా రిలీజ్ చేసింది. మేకింగ్ వీడియోనే బాగా వైరల్ అవుతుంది. మరి టీజర్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోలో ఓ పురాతన దేవాలయం సెట్ వేశారని.. వచ్చే వారం నుండి ఆ సెట్ లో చరణ్ – చిరు కాంబినేషన్ లోని సీన్స్ ను షూట్ చేయబోతున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

Also Read: బాహుబలి సినిమాలో కట్టప్ప ఎత్తుకున్న శిశు మహేంద్ర బాహుబలి ఎవరో తెలుసా?

ఇక ఈ ‘ఆచార్య’ కథ రాష్ట్రంలోని దేవాలయాలు మరియు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన కథ. ముఖ్యంగా అన్యాయాలను అక్రమాలను అరికట్టే శక్తిగా మెగాస్టార్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడని.. మెయిన్ గా దేవాలయాల పేరుతో జరుగుతున్న అవకతవకల పై పోరాటం చేసే ఎండోమెంట్స్ విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా మెగాస్టార్, ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడని తెలుస్తోంది. అందుకే మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా పై తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

Also Read: ‘పుష్ప’ ఆగస్టు 13న విడుదల !

కాగా ఈ సినిమాలో మెగాస్టార్ సరసన చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా చేస్తోంది. అన్నట్టు అన్నపూర్ణ స్టూడియోలో మొదలయ్యే షూట్ లో కాజల్ కూడా పాల్గొనబోతుందట. ఆమె ఈ సినిమాలో ఒక జర్నలిస్ట్ గా నటిస్తోందని తెలుస్తోంది. పైగా మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు లుక్ కూడా చేంజ్ చేయడం ఆసక్తి రేపుతోంది. ఇక రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపించబోతున్నాడట. అలాగే ఈ చిత్రంలో రెజీనా ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Back to top button