ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

తన వీడియో లీక్ పై స్పందించిన అచ్చెన్నాయుడు

Achennaidu responds to his video leak

ఏపీ రాజకీయాల్లో అచ్చెన్నాయుడు సంచలన విషయాలు పంచుకున్న వీడియో కలకలం రేపుతోంది. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలో టీడీపీ, చంద్రబాబు, లోకేష్ లపై అచ్చెన్న మాట్లాడినట్టు ఉన్న వీడియో వైరల్ అవుతోంది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ వీడియో లీక్ తో ఇరకాటంలో పడ్డారు.దీంతో తాజాగా నష్టనివారణ చర్యలు చేపట్టారు.

ఈ వీడియో లీక్ జగన్ పన్నిన విషపన్నాగం అని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. దొంగ సాక్షితో కలిసి కుట్ర పన్నారని మండిపడ్డారు. ఆ అదృశ్య వ్యక్తి పేరు బయటపెట్టకుండానే తన సంభాషణలను వక్రీకరించారని అచ్చెన్నాయుడు వాపోయారు. తిరుపతి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుపై రాళ్లు వేయించిన వైసీపీ నేతలే.. ఇవాళ తన సంభాషణల్ని వక్రీకరించారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

తిరుపతిలో ఓటమి భయంతోనే వైసీపీ నేతలు దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నారని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. ‘సీఎం జగన్, నీ దొంగ సాక్షి కలిసి ఎన్ని వీడియోలు వేసినా టీడీపీలో విభేదాలు సృష్టించలేవని.. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ తిరుపతిలో గెలుస్తుందనే నీకు ఓటమి భయం పట్టుకుందని అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈరోజునా సంభాషణలను వక్రీకరించావని.. ఎన్ని విషపన్నాగాలు పన్నినా తెలుగుదేశం విజయాన్ని ఆపలేవన్నారు.

నారాలోకేష్ తో తనకున్న అనుబంధాన్ని ఈ వీడియోతో విడదీయలేవు అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

లీకైన వీడియోలు ఖచ్చితంగా సీఎం జగన్, వైసీపీ నేతల కుట్రగా అచ్చెన్నాయుడు అభివర్ణించారు. మరీ ఈ వివాదం మున్ముందు ఎటువంటి మలుపులు తిరుగుతుందో వేచిచూడాలి.

Back to top button