బాలీవుడ్సినిమా

లాక్ డౌన్ ఎఫెక్ట్.. నటుడు ఆత్మహత్య


లాక్ డౌన్ ప్రభావం దేశంలోని అన్నిరంగాలపై ప్రభావం చూపుతోంది. 50రోజులుగా దేశంలో లాక్డౌన్ కొనసాగుతుండటంతో ప్రతీఒక్కరూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లాక్డౌన్ ప్రభావంతో వలస కార్మికులు, సామాన్యులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఇక ఈ ప్రభావం సీనిరంగంపై కూడా పడుతోంది. లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు వాయిదా పడగా, థియేటర్లు మూతపడ్డాయి. దీంతో ఈరంగంలో పనిచేసే కార్మికులు, నటులు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పట్లో సినిమా షూటింగులు ప్రారంభమయ్యే పరిస్థితులు కన్పించకపోవడంతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

తాజాగా పంజాబీ నటుడు మ‌న్మీత్ గైవాల్(29) ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడటంతో చిత్రపరిశ్రమలో విషాదచాయలు నెలకొన్నాయి. లాక్డౌన్ కారణంగా షూటింగులు ఆగిపోవడంతో మాసిసిక ఒత్తిడికి గురయ్యాడు. దీనికితోడు ఆర్థిక సమస్యలు భారం కావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ‘ఆదత్ సే మజ్బూర్’, ‘కుల్దీపాక్’ వంటి సీరియల్స్ లో మన్మీత్ నటించాడు. అంతేకాకుండా పలు టెలివిజన్ కార్యక్రమాలు, వాణిజ్య ప్రకటనల్లోనూ నటించాడు. ఢిల్లీకి చెందిన మ‌న్మీత్ పెళ్లి త‌ర్వాత‌ ముంబైకి వెళ్లాడు. భార్యతో కలిసి నవీ ముంబైలో ఉంటున్నాడు. మ‌న్మీత్ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Back to top button