సినిమాసినిమా వార్తలు

Actor Uttej: ఉత్తేజ్ కష్టం పగవాడికి రాకూడదూ..!

చిరంజీవి, ప్రకాష్ రాజ్ లు ఎంత ఓదార్చినా ఏడ్చేసిన ఉత్తేజ్ ను చూసి అందరూ అయ్యో పాపం అంటున్నారు.

Actor Uttej: Wife Dies in Hyderabad. Chiranjeevi, Prakash Raj Pay Condolences

Actor Uttej: సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల లోకం. ఈ లోకంలో బతకడం చాలా కష్టం. వందల మంది ఆర్టిస్టులు ఉన్నా.. ఆర్థికంగా.. ఏ కష్టాలు లేకుండా సెటిల్ అయ్యింది కేవలం పదుల సంఖ్యలోనే ఉంటారు. ఆ మాయాలోకంలో బతకలేక బతుకీడుస్తున్న వారే ఎక్కువ.

చాలా చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీపై ప్రేమతో వచ్చాడు ఉత్తేజ్. ఎన్నో కష్టాలు పడ్డాడు. సహాయ దర్శకుడిగా మారి.. నటుడిగా.. రచయితగా రకరకాల ప్రయత్నాలు చేశాడు. ఇన్నేళ్ల కెరీర్ లో ఎప్పుడూ ఉత్తేజ్ కు సరైన బ్రేక్ రాలేదు. వరుసగా సినిమా అవకాశాలు రాలేదు. అప్పుడో ఇప్పుడో ఒక సినిమా చాన్స్ వచ్చేది. ఇటీవల ‘ఫలక్ నూమా’ దాస్ మూవీలో ఉత్తేజ్ నటించాడు. ఆ తర్వాత పెద్దగా కనిపించలేదు.

అవకాశాలు వస్తూ పోతూ అసలు సెటిల్ మెంట్ లేకుండా కుటుంబాన్ని పోషించుకోకుండా ఉత్తేజ్ నెట్టుకొస్తున్నాడు. సినీ రంగాన్ని నమ్ముకొని పెద్దగా ఆస్తులు కూడబెట్టింది లేదు. కనీస సొంత ఇల్లు కూడా ఇన్నాల్లు ఉత్తేజ్ కు లేదు.

ఈ క్రమంలోనే ఉత్తేజ్ ‘మయూఖ టాకీస్’ పేరుతో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ పెట్టాడు. కొత్తగా వచ్చే నటీనటులకు యాక్టింగ్ నేర్పిస్తున్నాడు. అది సక్సెస్ అయ్యి మంచి పేరు తీసుకొచ్చింది. దాదాపు 8 బ్యాచ్ లు తయారు చేశాడు. ఆర్థికంగా స్థిరపడి ఇటీవలే సొంత ఇల్లు కూడా నిర్మాణం చేపట్టాడు.

అయితే సొంతింటి కల నెరవేరుతున్న శుభ సందర్భంలో ఆయన ఇంట తీవ్ర విషాదం అలముకుంది. ఉత్తజ్ భార్య పద్మ తాజాగా క్యాన్సర్ తో మృతిచెందండం కృంగదీసింది. ఇప్పుడిప్పుడే అప్పులు తేరి ఇక జీవితంలో స్థిరపడాలనుకుంటున్న సమయంలో భార్య మరణం తట్టుకోలేక ఉత్తేజ్ చిన్న పిల్లాడిలా ఏడ్చిన వైనం అందరినీ కంటతడిపెట్టించింది. చిరంజీవి, ప్రకాష్ రాజ్ లు ఎంత ఓదార్చినా ఏడ్చేసిన ఉత్తేజ్ ను చూసి అందరూ అయ్యో పాపం అంటున్నారు.

ఉత్తేజ్ కు ఇద్దరు కుమార్తేలే. పెద్ద కూతురుకు పెళ్లి చేశాడు. చిన్న కూతురు 10వ తరగతి చదువుతోంది. ఇంతలోనే ఆయన భార్య దూరం కావడంతో ఇప్పుడు మళ్లీ ఉత్తేజ్ జీవితం మొదటికొచ్చింది. పిల్లల బాధ్యత.. అటు జీవితంలో స్థిరపడాలన్న ఆయన ఆశ తీరకుండా పోయే ప్రమాదంలో పడింది. ఉత్తేజ్ కష్టాలు పగవాడికి కూడా రావొద్దని అంటున్నారు. సినీ ఇండస్ట్రీలో ఆర్టిస్టుల జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయో తాజాగా తెలిసివచ్చింది.

Back to top button