టాలీవుడ్సినిమా

Tollywood: ఆయన్ని చూసి నటీనటులు ఆశ్చర్యపోయారట !

Prakash Raj

ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ కు ఓ చిత్రం షూటింగ్ లో ప్రమాదం జరిగింది. చేతికి ఫ్రాక్చర్ కూడా అయింది. హైదరాబాద్ లోని డాక్టర్ గురువారెడ్డి వద్ద ప్రకాష్ రాజ్ సర్జరీ కూడా చేయించుకున్నారు. సర్జరీ జరిగి నేటికీ మూడు రోజులు. సహజంగా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే మరొకరు పూర్తిగా విశాంత్రి తీసుకుంటారు. కానీ ప్రకాష్ రాజ్ మాత్రం పోరాటానికి దిగారు.

త్వరలో జరగబోయే ‘మా’ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, ప్రకాష్ రాజ్ తన ఫ్యానల్ సభ్యులతో ఈ రోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా జెండా ఎగురవేసి తోటి సభ్యుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. అయితే, ఈ కార్యక్రమానికి ప్రకాష్ రాజ్ తన చేతికత్తుతోనే రావడం, ఒక పక్క గాయం నొప్పి కలిగిస్తున్నా.. ఆయన మొహం పై అదే చిరునవ్వు ఉండేలా ప్రకాష్ రాజ్ తాపత్రయపడటం చూసి అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యపోయారట.

ఇది చూసి.. ప్రకాష్ రాజ్ మారిపోయిన మనిషి అంటూ ఆయన గురించి తెలిసిన నటీనటులు కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ప్రకాష్ రాజ్ చాలా ఆవేశపరుడు. ఎదుట వ్యక్తి చిన్న తప్పు చేసినా సహించడు. అలాంటిది ఆయన ఇప్పుడు ఓపికతో అందర్నీ కలుపుకుని పోతూ కార్యక్రమాలని విజయవంతం చేయడం అంటే కచ్చితంగా ఇది విశేషమే.

అసలు ప్రకాష్ రాజు గురించి బాగా తెలిసిన వారు ఇదంతా నమ్మలేకపోతున్నారు. గతంలో చెప్పిన టైంకి షూటింగ్ కి రాకుండా ఆలస్యంగా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు సమయానికి విలువ ఇస్తూ ఖచ్చితత్వంతో కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండటం గొప్ప విషయమే. మొత్తానికి ప్రకాష్ రాజ్ ‘మా’ ఎన్నికల కోసం బాగా కష్టపడుతున్నాడు. మరి “మా” ఎన్నికల్లో విజయం సాధిస్తాడా ? చూడాలి.

Back to top button