అప్పటి ముచ్చట్లు

అప్పటి ముచ్చట్లు : ‘భానుమతి’ తన కోసం వచ్చేసరికి అతను.. !

Bhanumathi
ఇప్పుడంటే సినిమా వాళ్ల గురించి ప్రతిదీ తెలుస్తోంది కానీ, ఒకప్పుడు వాళ్ళ గురించి తెలుసుకోవాలని ప్రేక్షకులు కలలు కంటూ ఉండేవారు. అప్పటి సినీ తారలను కలిసేందుకు అభిమానులు వారి ఇంటి చుట్టూ క్యూ కట్టేవారు. ముఖ్యంగా స్టార్స్ ను చూడటానికి అప్పట్లో బస్ లు వేయించుకుని వెళ్ళేవారు. ఇక ఎన్టీఆర్ కోసం అయితే.. తిరుపతి యాత్ర తరువాత ఎన్టీఆర్ దర్శనం అని ఎన్టీఆర్ ఇంటి ముందు బారులు తీరేవారు. ఎన్టీఆర్ కూడా ఉదయాన్నే తన కోసం వచ్చిన అభిమానులతో ముచ్చటించి షూటింగ్‌ కు వెళ్లేవారు.

మరి తమ అభిమాన తారే నేరుగా ఇంటికి వస్తే.. ఇక ఆ అభిమాని పరిస్థితి ఏమిటి ? ఆ అభిమాని ఆనందానికి అవధులు ఉండవు. ఇలాంటి సంఘటన ఓ సారి చోటు చేసుకుంది. భానుమతి చాలా ఏళ్ల క్రితం తెనాలిలో ఒక స్థలం కొన్నారు. అయితే కొన్ని రోజులు తరువాత ఆ స్థలం రిజిస్ట్రేషన్‌ చేసిన ఒక అధికారి మద్రాసుకి ఏదో పని మీద వెళ్ళాడట. అయితే అతనికి చిన్న తనం నుండే నటి భానుమతి అంటే విపరీతమైన అభిమానం అట. దాంతో భానుమతిని వెళ్లి కలుసుకొని, తెనాలిలో మీ స్థలం రిజిస్ట్రేషన్‌ చేసింది నేనే అంటూ ఆమెతో కాసేపు ముచ్చటించాడట.

ఈ క్రమంలో అతను తిరిగి వెళ్తూ.. ‘‘నేను మీ అభిమానిని. మీరు ఎప్పుడైనా తెనాలి వస్తే వీలు చూసుకుని మా ఇంటికి రండి’’ అని, తన చిరునామా ఇచ్చి వెళ్ళాడట. అతని మాట తీరు నచ్చడంతో.. భానుమతి మొత్తానికి తెనాలి వెళ్ళినప్పుడు, ఆ రిజిస్ట్రార్‌ ను గుర్తుపెట్టుకుని మరీ అతని చిరునామా కనుక్కొని నేరుగా ఆయన ఇంటికి వెళ్ళిందట. ఎవరో తలుపు కొడుతున్నారు అని వచ్చి రిజిస్ట్రార్‌ తలుపుతీశాడు. ఎదురుగా నవ్వుతూ భానుమతి కనిపిచింది. ఇక ఆంతే.. షాక్ తో అతను అలాగే కళ్లు తిరిగి పడిపోయాడు. భానుమతి వెంటనే బాటిల్ లో నీళ్లను అతని ముఖాన చల్లారు. దాంతో అతను తెప్పరిల్లి లేచి కూర్చున్నాడు. భానుమతి అలాగే నిలబడి అతన్నే చూసి నవ్వుతూ ఉంది.

Back to top button